హెచ్ 1 బి వీసాల ప్రక్రియలో ట్రంప్ కు షాక్ ఇచ్చిన... కాలిఫోర్నియా కోర్ట్

VAMSI
అమెరికాలో హెచ్ 1 బి వీసాల మీద ట్రంప్ ప్రవేశ పెట్టిన కొత్త పద్దతికి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హెచ్ 1 బి వీసాల ప్రక్రియల్లో అనుసరిస్తున్న లాటరీ విధానానికి వ్యతిరేకంగా గతంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త విధానానికి అమెరికా కాలిఫోర్నియా నార్తర్న్ డిస్ట్రిక్ట్ న్యాయస్థానం అడ్డు కట్ట వేసింది. అసలేం జరిగిందంటే, అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రాక ముందు హెచ్ 1 బి వీసాల కోసం ఒక లాటరీ విధానాన్ని అమలుపరిచే వారు. అయితే ఈ విధానానికి వ్యతిరేకంగా శాలరీని బట్టి వీసాలను జారీ చెయ్యాలని అప్పటి యుఎస్సీఐఎస్ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ పద్దతి సరైనది కాదని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యతిరేకించడం జరిగింది.
అప్పుడే ఈ విధానాన్ని రద్దుచేయాలని కాలిఫోర్నియా నార్తర్న్ జిల్లా కోర్టు లో పిటిషన్ వేసింది. అయితే ఈ విషయంలో అన్ని కోణాలలో ఆలోచించి విచారణ అనంతరం న్యాయమూర్తి జాప్రీ వైట్ తాజాగా తీర్పు చెప్పారు. అప్పట్లో హెచ్ 1 బి వీసా ప్రక్రియలో ఉత్తర్వులు ఇచిన హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ చాధ్ ఓల్ఫ్ లీగల్ గా వెళ్లలేదని తీర్పునిచ్చింది. అంతే కాకుండా ఈ పద్ధతిని రద్దు చేస్తున్నట్లుగా తీర్పు ఇచ్చారు. మామూలుగా అమెరికాలో జీవిస్తున్న వారిలో భారత్ నుండి వెళ్లి స్థిరపడిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. అమెరికాలో శాస్త్ర, సాంకేతిక, గణిత మరియు ఇంజనీరింగ్ లాంటి ముఖ్యమైన రంగాల్లో నిపుణులైన విదేశీయులను ఎంచుకోవడానికి హెచ్ 1 బి వీసాలను కల్పిస్తూ వచ్చింది. తద్వారా ఎక్కువ సంఖ్యలో భారతీయులు మరియు చైనా దేశస్థులు ఉన్నారు.
ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఈ వీసాలను పొందడానికి అప్లికేషన్ లు వస్తుంటాయి. కానీ మొత్తం మీద సంవత్సరానికి కేవలం 85 వేల మందికి మించకుండా వీసా అర్హతను కల్పిస్తున్నారు. ఇందు కోసం లాటరీ పద్ధతిని అమలు చేసేవారు. అయితే గతంలో ట్రంప్ ప్రభుత్వం సమయంలో ఈ విధానాన్ని రద్దు చేయడానికి పూనుకున్నారు. అలా ఈ కొత్త విధానాన్ని  మార్చి 9 2021 న  అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విధానాన్ని కాస్తా రద్దు చేస్తూ కాలిఫోర్నియా నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. ఓడిపోయిన ట్రంప్ కు ఇది మరో చేదువార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: