బైడ‌న్ ను ట్రంప్ అంత మాట అనేశాడు ఎంటి?

Dabbeda Mohan Babu
మైక్ దోరికిన‌ప్పుడ‌ల్ల బైడ‌న్ పై విరుచుకు ప‌డే డోనాల్డ్ ట్రంప్ మ‌రో సారి బైడ‌న్ పై వివాదాస్ప‌ద వ్యాక్య‌లు చేశాడు. త‌న‌కు ఉన్న తిక్క‌ను ప్ర‌తి సారి అమెరికా అధ్య‌క్షుడు బైడ‌న్ పై చూపిస్తాడు. అలా నే తాను బాక్సింగ్ రింగ్‌లో దిగితే బైడ‌న్ ను ఒక్క గుద్దుతో పడగొడతా అని మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ అన్నారు. ఈ తిక్క మాట‌లు విని అమెరిక ప్ర‌జ‌లు త‌మ దేశ అధ్య‌క్షున్ని ఇంత మాట అనేశాడేంది అని ముక్కున వేలేసుకుంటున్నారు.

శ‌నివారం హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్లు ఇవాండర్ హోలీఫీల్డ్, విటోర్ బెల్‌ఫోర్ట్‌ల మధ్య బాక్సింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అమెరికాలో గ‌ల‌ ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమీనోల్ రాక్ కాసినోలో జ‌ర‌గ‌బోతుంది. దీనికి వ్యాఖ్యాత‌గా అమెరికా దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్య‌వ‌హిరిస్తున్నారు. అందులో భాగంగా బాక్సింగ్ మ్యాచ్ కు ముందు నిర్వహించే మీడియా సమావేశం లో ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఓ రిపోర్టర్ ట్రంప్ ను మీరు బాక్సింగ్ రింగ్‌లోకి దిగితే మీ ప్రత్యర్థి ఎవరై ఉండాలని అని ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానంగా  త‌న‌కు అత్యంత సుల‌భ‌మైన జో బైడ‌న్ ను ప్ర‌త్య‌ర్తిగా ఎంచుకుంటాన‌ని అన్నారు. అంతే కాకుండా ఒక గుద్దుతో బైడ‌న్ ను ఓడిస్తానని అన్నారు.

కాగ ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని లేపాయి. ఇరు వర్గాల అభిమానులు రెచ్చిపోతున్నారు. కొంతమంది బైడెన్, ట్రంప్‌ల ఫోటోలను మార్ఫ్ చేసి బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేస్తున్నట్లు కార్టూన్లు సృష్టించారు. ప్ర‌స్తుతం ఇవి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాయి.  దీని నెటిజ‌న్లు ఈ మార్ఫింగ్ ఫోటోల‌ను వైర‌ల్ చేస్తున్నారు. కాగా గ‌తంలో బైడ‌న్ కూడా ఇలాంటి వ్యాక్య‌ల‌ను చేశారు. 2018లో మియామీ యూనివర్సిటీలో జరిగిన ఓ ర్యాలీలో మహిళలపై ట్రంప్ చేస్తున్న అస‌భ్య‌క‌ర‌మైన  వ్యాఖ్యలను ఖండించారు.  అప్పుడు బైడ‌న్ కూడా ట్రంప్ ను కొడుతాన‌ని వ్యాక్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: