యూకే వెళ్తున్నారా.. ఈ న్యూస్ మీకోసమే...?

Suma Kallamadi
బ్రిటిష్ ఎయిర్‌వేస్ వారానికి మూడుసార్లు భారతదేశంలో విమాన ప్రయాణాలు కొనసాగిస్తోంది. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి చెన్నైలోని విమానాశ్రయానికి ప్రయాణ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 31వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ విమానయాన సేవలు లండన్ - చెన్నై నగరాల మధ్య కొనసాగనున్నాయి. ఆది, బుధ, శుక్ర వారాల్లో లండన్ నుంచి చెన్నైకి విమానాలు ప్రయాణించనున్నాయి. సోమ, గురు, శని వారాల్లో చెన్నై నుంచి లండన్ కు విమానాలు ప్రయాణించనున్నాయి. దీన్నిబట్టి భారత పౌరులు చెన్నై నుంచి యూకే వెళ్లాలంటే సోమ, గురు, శని వారాల్లో ప్రయాణం ప్రారంభిస్తే సరిపోతుంది. ఆగస్టు 16 నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రజా రవాణా విమానాలను 10 నుంచి 20కు పెంచింది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై విమానాశ్రయాల్లోనూ రిటర్న్ ఫ్లైట్ కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని బ్రిటిష్ విమానయాన శాఖ వెల్లడించింది.


గతంలో భారతదేశాన్ని రెడ్ లిస్టులో ఉంచిన యూకే గవర్నమెంట్ ఇప్పుడు దానిని తొలగించి అంబర్ లిస్ట్ లో చేర్చింది. "ప్రపంచ విపత్తు కారణంగా యూకేలోని తమ బంధువులను చూడలేకపోయిన భారతీయులందరూ ఇప్పుడు చూడొచ్చు. విద్యార్థులు తమ చదువుల నిమిత్తం ఇంగ్లాండ్ కి రావచ్చు. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము" అని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ టికెట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి డబ్బులు వసూలు చేయమని స్పష్టం చేసింది.

మారుతున్న ఎంట్రీ అవసరాలను తెలుసుకునేందుకు.. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కస్టమర్ల కోసం VeriFLY యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని యూకే అధికారులు సూచించారు. లండన్‌కు బయలుదేరే ముందు భారతీయులు VeriFLY యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా అత్యంత ఉపయోగకరమైన విషయాలు తెలుసుకోగలరు. ఈ డిజిటల్ హెల్త్ యాప్ కస్టమర్ల ట్రావెల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, కోవిడ్ -19 టెస్ట్ రిజల్ట్స్ ఒకే దగ్గరకు చేరుస్తుంది. తద్వారా భారతీయ ప్రయాణికులు త్వరితగతిన ప్రయాణ అర్హత సాధించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: