ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఐదుగురు ఇండో-అమెరికన్లు..!

Suma Kallamadi
అమెరికా రిచెస్ట్ సెల్ఫ్-మేడ్ ఉమన్ జాబితాలో భారత మూలాలు ఉన్న ఐదుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు. ఈ ఇండో-అమెరికన్లు సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా యూఎస్‌లోని అందరి మహిళల్లో కెల్లా అత్యంత ధనవంతులుగా రాణిస్తున్నారు. ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్-మేడ్ ఉమన్ జాబితాలో నిలిచిన వీరు సాటి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వారి పేర్లు ఏంటో తెలుసుకుంటే.. జయశ్రీ ఉల్లాల్, ఇంద్ర నూయి, నీర్జా సేథి, నేహా నార్ఖడే, రేష్మా శెట్టి. ఈ ఏడాదికి సంబంధించి ఆగస్టు 5న ఫోర్బ్స్ ధనవంతుల జాబితాను విడుదల చేయగా.. ఈసారి ఐదుగురు ఇండో అమెరికన్లు ధనవంతులు జాబితాలో స్థానం సంపాదించడం విశేషం.
లండన్‌లో పుట్టి భారతదేశంలో పెరిగి అమెరికాలో స్థిరపడిన జయశ్రీ ఉల్లాల్(60) 2008 నుంచి అరిస్టా నెట్‌వర్క్‌కు అధిపతిగా కొనసాగుతున్నారు. ఆమె నికర ఆస్తి విలువ 1.7 బిలియన్ డాలర్లు ఉండగా.. ఫోర్బ్స్ జాబితాలో 16వ స్థానంలో చోటు దక్కించుకున్నారు.
ఇక ఫోర్బ్స్ జాబితాలో 26వ స్థానంలో ఉన్న నీర్జా సేథి నికర ఆస్తి విలువ 1 బిలియన్ డాలర్లు. ఈమె తన భర్త భరత్ దేశాయ్‌తో కలిసి ఐటి కన్సల్టింగ్, అవుట్‌సోర్సింగ్ సంస్థ అయిన సింటెల్‌ను 1980లో మిచిగాన్ లోని తమ అపార్ట్‌మెంట్‌లో స్థాపించారు. అయితే 2018లో ఈ సంస్థను 3.4 బిలియన్లకు అమ్ముడుపోయింది. ఇందులో సేథి $510 మిలియన్లను వాటాగా పొందారు.
నేహా నార్ఖేడ్ 925 మిలియన్ డాలర్లతో 29వ స్థానంలో నిలిచారు. ముఖ క్లౌడ్ కంపెనీ కాన్ఫ్లూయెంట్ ని స్థాపించిన వారిలో ఒకరైన నేహా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా కూడా పని చేశారు. తన ప్రతిభ తెలివితో ఆమె మిలియన్ డాలర్లను సంపాదించి అత్యంత ధనవంతమైన మహిళల్లో ఒకరిగా నిలుస్తున్నారు.
41 ఏళ్ల జింగో బయోవర్క్స్ కి కో-ఫౌండర్. రేష్మా శెట్టి 39 వ స్థానంలో ఉన్నారు. బయో టెక్నాలజీ కంపెనీ ద్వారా ఆమెన్ 750 మిలియన్ల డాలర్లను సంపాదించారు. పెప్సికో సీఈఓ గా 12 సంవత్సరాల పాటు పనిచేసిన ఇంద్ర నూయి 290 మిలియన్ల డాలర్లతో 91వ ప్లేస్ లో నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: