మహిళలకు శుభవార్త.. వడ్డీలేని రుణాలు ఇస్తున్న కుర్ర ఎన్ఆర్ఐ..!
ఆ డబ్బుతో మైక్రో ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ అయిన 'సస్టెయినింగ్ విమెన్ ఇన్ ఫైనాన్షియల్ టర్మోయిల్ (SWIFT)' స్థాపించాడు. 2020, సెప్టెంబరులో ఏర్పాటైన ఈ వడ్డీ లేని ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ నుంచి ఇప్పటికే భారతదేశం, అల్బేనియా, ఫిలిప్పీన్స్, ఈక్వెడార్, కిర్గిజ్‌స్తాన్ తదితర దేశాలలోని మహిళలు లబ్ధి పొందారు. పేదరికంతో సతమతమవుతున్న మహిళలకు రుణాలు ఇచ్చేందుకు శశంకర్ చాలా కృషి చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు 77 దేశాలలో 1,000 మంది పేద మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాడు. దీంతో వారి జీవితాలే మారిపోయాయి.
అయితే అతడు ఇస్తున్న రుణాలన్నీ 98.75%రికవరీ రేటుతో ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రాణాలు తీసుకున్న 100 మంది మహిళల్లో దాదాపు 99 మంది తిరిగి రుణాలు చెల్లించడం అనేది మామూలు విషయం కాదు. రుణగ్రహీతలలో ఎక్కువమంది రైతులు, నేత కార్మికులు, చిరు వ్యాపారులు, కళాకారులు ఉన్నారు. కాగా, శాసన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న కివా అనే లాభాపేక్షలేని సంస్థతో శశంకర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి శశంకర్ కి తెలియజేస్తుంది. తద్వారా ఎవరికి లోన్ ఇవ్వాలనే విషయంలో శశంకర్ నిర్ణయం తీసుకోగలుగుతున్నాడు. తాను ఇచ్చే రుణాలు నిరుద్యోగ మహిళలకు ఎంతగానో సహాయపడతాయని ఈ 16 ఏళ్ల బాలుడు చెబుతున్నాడు. ఏదేమైనా చిన్న వయసులోనే వేలాది మహిళల జీవితాలలో కాంతులు నింపుతున్న శశంకర్ సేవలు అభినందనీయం.