మరో ఇండియన్‌ని నామినేట్ చేసిన జోబైడెన్?

Suma Kallamadi
న్యాయ నామినేషన్ల ఐదవ పర్వంలో జోబైడెన్ మరో భారత మూలాలున్న వ్యక్తిని నామినేట్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన పలువురు ఎన్నారైల పేర్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే బుధవారం రోజు ఇండియన్-అమెరికన్ షలీనా డి కుమార్ ని మిచిగాన్ జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్ గా నియమించేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం మిచిగాన్ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ షలీనా కుమార్ యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్ గా నియమించబడితే.. దక్షిణాసియా సంతతికి చెందిన మొదటి ఫెడరల్ లాయర్ అవుతారు. మిచిగాన్ సుప్రీంకోర్టు 2018వ సంవత్సరం జనవరి నెలలో షలీనా డి కుమార్ ని సర్క్యూట్ కోర్టుకు చీఫ్ జడ్జిగా నియమించింది. ఆమె 2007వ సంవత్సరం నుంచి ఓక్లాండ్ కౌంటీ ఆరవ సర్క్యూట్ న్యాయస్థానంలో పనిచేశారు. ఆమె చీఫ్ జడ్జిగా విధులు నిర్వర్తించడం తో పాటు.. సివిల్, క్రిమినల్ కేసులను కూడా నియంత్రిస్తుంటారు.

ఆమె ధర్మాసనం లోకి అడుగు పెట్టిన తర్వాత కొనసాగిన పదవుల గురించి తెలుసుకుంటే.. అడల్ట్ ట్రీట్మెంట్ కోర్టుకు ప్రిసైడింగ్ జడ్జిగా వ్యవహరించారు. ఓక్లాండ్ కౌంటీ క్రిమినల్ అసైన్‌మెంట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా కొద్దికాలం పాటు కొనసాగిన ఆమె ఓక్లాండ్ కౌంటీ బార్ అసోసియేషన్ సర్క్యూట్ కోర్టు కమిటీకి అనుసంధానంగా ఉన్న మిచిగాన్ స్టేట్ బార్ మెంబర్ గా విధులు నిర్వర్తించారు. అయితే ఆమె యునైటెడ్ స్టేట్స్ లాయర్ కాకముందు 1997 నుంచి 2007 వరకు సివిల్ లిటిగేటర్ గా ప్రైవేట్ ప్రాక్టీసు చేశారు. 1993లో మిచిగాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె 1996 లో డెట్రాయిట్-మెర్సీ స్కూల్ ఆఫ్ లా యూనివర్సిటీలో న్యాయశాస్త్రానికి సంబంధించిన చదువు పూర్తి చేశారు.


ఆమె నార్త్ అమెరికాలోని సౌత్ ఏషియన్ బార్ అసోసియేషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రముఖ భారతీయ అమెరికన్ బార్ అసోసియేషన్ "ఇంపాక్ట్" కూడా ఆమెకు మద్దతు ఇచ్చింది. 2007వ సంవత్సరంలో ఓక్లాండ్ కౌంటీలో సర్క్యూట్ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి ఆమె తల్లిదండ్రులు కృష్ణ కుమార్, మార్గరెట్ కుమార్ హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: