అమెరికాలో పోలీస్ చీఫ్‌గా ఎన్నారై నియామకం..?

Suma Kallamadi
భారత మూలాలున్న మైఖేల్ కురువిల్లా(37) అనే వ్యక్తి అరుదైన ఘనత సాధించారు. అమెరికాలో మొట్టమొదటి శ్వేత వర్ణేతర పోలీస్ చీఫ్‌గా ఆయన నియమితులయ్యారు. అమెరికా దేశంలో ఇప్పటివరకు శ్వేతజాతీయులు తప్ప మరేతర దేశీయులు పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టలేదు. కానీ భారత సంతతికి చెందిన కేరళ వ్యక్తి పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అర్హత సాధించి చరిత్ర సృష్టించారు.

మైఖేల్ కురువిల్లా కి పోలీస్ చీఫ్‌ బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన నైపుణ్యాలు, అవగాహన ఉందని.. దాదాపు 15 సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మైఖేల్ కొనసాగారని.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని ఎలా లీడ్ చేయాలో ఆయనకు తెలుస్తుందని.. ఆయన తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించారని యాక్టింగ్ పోలీస్ చీఫ్ ఎడ్వర్డ్ పెట్రాక్ చెబుతూ అతన్ని బ్రూక్ ఫీల్డ్ కి తదుపరి పోలీసు చీఫ్‌గా నియమించాలని రికమండ్ చేశారు.


ఎడ్వర్డ్ పెట్రాక్ సిఫార్సుని ఆమోదిస్తూ విలేజ్ మేనేజర్ తిమోతీ వైబెర్గ్ మైఖేల్ కురువిల్లా ని పోలీసు చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జులై 12వ తేదీన ఎడ్వర్డ్ పెట్రాక్ నుంచి అత్యున్నత పోలీసు చీఫ్ పదవిని మైఖేల్ అధిష్టించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాకి తాము వలస వచ్చామని.. లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో తనకు ఎవరూ తెలియదని.. పోలీస్ గా చేరిన అనంతరం పని పట్ల తనకు ఎంతో ఇష్టం పెరిగిందని..  అందుకే ఈ రోజు ఈ స్థాయికి రాగలిగానని ఆయన అన్నారు.


ప్రస్తుతం మైఖేల్ డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2006 వ సంవత్సరంలో ఆయన బ్రూక్ ఫీల్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఇల్లానియిస్ యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మైఖేల్ పౌర సంక్షోభ వర్కర్ గా కొద్ది నెలల పాటు పనిచేశారు. 2020 సెప్టెంబర్ నెలలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ (IACP) సంస్థ కురువిల్లాకు "40 అండర్ 40" అవార్డును అందజేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: