బైడెన్ కి ఆ ఎన్ఆర్ఐ విన్నపం..!

Suma Kallamadi
ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి భారతదేశం కోసం తరచూ గళం విప్పుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో ఇండియా అత్యంత దుర్భేద్యమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చాలా మంది ఎన్ఆర్ఐ లతో పాటు రాజా కృష్ణమూర్తి కూడా తన వంతు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాజా కృష్ణమూర్తి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనా వ్యవస్థకు ఒక విజ్ఞప్తి చేశారు. కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొంటున్న భారతదేశం తో పాటు ఇతర దేశాలలోనూ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను వేగంగా పంపిణీ చేయాలని ఆయన బైడెన్ సర్కార్ కి విజ్ఞప్తి చేశారు.


"భారతదేశం, ఇతర దేశాలలో రెండవ దశలో విజృంభిస్తున్న కరోనాతో అమెరికా ఆస్ట్రాజెనీకా వ్యాక్సిన్ల నిల్వలతో పోరాడుతున్న నేపథ్యంలో, టీకాలు వేగంగా పంపిణీ చేస్తున్నారో లేదో నిర్ధారించడానికి మా విచారణలో భాగంగా బిడెన్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ముఖ్యమైన సమావేశం కోసం అభ్యర్థించాము. నేను రెప్‌మలోనీ, విప్‌క్లైబర్న్ రెప్‌స్టెఫెన్‌లించ్‌లతో కలిసి బైడెన్ సర్కారుతో భేటీ అయ్యేందుకు విజ్ఞప్తి చేశాను," అని కృష్ణమూర్తి ట్వీట్ చేశారు.


అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కార్యదర్శి అయిన జేవియర్ బెకెరా, రాష్ట్రాల కార్యదర్శి అయిన ఆంటోనీ బ్లింకెన్ కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు చాలా కృషి చేశారని కృష్ణమూర్తి ప్రశంసిస్తూ గతంలో కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్‌కు ఒక లేఖ రాసారు.



"యుఎస్‌లో కోవిడ్ -19 వ్యాప్తిని ఎదుర్కోవటానికి మీ నిరంతర కృషిని మేము అభినందిస్తున్నాము.  అమెరికన్లను కరోనా నుంచి రక్షించడంలో బైడెన్ సర్కార్ వేగవంతమైన విజయం సాధించింది. ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకమైన కోవిడ్ -19 ఎదుర్కొంటున్న ఇతరులకు సహాయపడే అవకాశాన్ని అందిస్తుంది. 2021, ఏప్రిల్ 26, ఇతర దేశాలకు 60 మిలియన్ల వరకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము," అని కృష్ణమూర్తి లేఖలో పేర్కొన్నారు.


ఇండియా, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోందని 3 రోజుల వ్యవధిలోనే భారతదేశంలో 1 మిలియన్ కేసులు నమోదయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల పనితీరును పూర్తిస్థాయిలో సమీక్షించిన తర్వాతనే ఇండియాకి పంపించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొద్ది వారాల సమయం తర్వాత ఇండియాకి వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: