అమెరికా నుంచి 6 కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలు దిగుమతి..?

Suma Kallamadi
 అమెరికా దేశం 60 మిలియన్ల ఆస్ట్రాజెనెకా టీకాలను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే ఆ 6 కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలలో గరిష్ఠ భాగం సేకరించాలని భారత ప్రభుత్వం తపనపడుతోంది. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు విధ్వంసకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే రానున్న కొద్ది వారాలలోనే 10 మిలియన్లు అనగా 1 కోటి ఆస్ట్రాజెనెకా టీకాలను భారత దేశానికి ఎగుమతి చేయనున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. మిగతా టీకాలను జూన్ నెల లోపు ఇండియాకి సరఫరా చేస్తామని వైట్ హౌస్ చెప్పుకొచ్చింది. అయితే అమెరికా నిర్ణయించిన గ్లోబల్ షేర్ లో ఏ దేశానికి ఎక్కువ వ్యాక్సిన్లు పంపిస్తారో వెల్లడించలేదు కానీ భారత దేశం మాత్రం గ్లోబల్ షేర్ నుంచి అత్యధిక స్థాయిలో లబ్ధి పొందుతుందని అక్కడి అధికారులు తెలిపారు.


భారత ప్రధాని నరేంద్ర మోడీ సహాయకుడు మాట్లాడుతూ.. "ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తులు, ఉన్నత ప్రజారోగ్య నిపుణులు దేశాల సంబంధాల మధ్య వ్యవహరించిన తీరు.. అమెరికా ప్రభుత్వం యొక్క ఆలోచనను మార్చాయి. అందువల్ల ఇప్పుడు మేము అమెరికా నుంచి టీకాలు పొందడానికి సిద్ధంగా ఉన్నాయి," అని చెప్పుకొచ్చారు.


వాస్తవానికి అమెరికా దానంతట తానే భారతదేశానికి సహాయం చేసేందుకు ముందుకు రాలేదట. మొదట్లో జో బైడెన్ కూడా వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి అయిష్టత చూపించారట. దీంతో భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రంగంలోకి దిగి అమెరికా భద్రత సలహాదారు జేక్ సులేవాన్ తో మాట్లాడుతూ.. అమెరికన్ కంపెనీల పట్ల మేం వ్యవహరించాల్సిన తీరును సమీక్షించుకుంటాం అని చాలా మర్యాదపూర్వకంగా హెచ్చరికలు జారీ చేశారట. ఒకవేళ అమెరికా దిగుమతులపై భారత్ హెవీ టాక్సెస్ విధిస్తే జో బైడెన్ సర్కార్ కి నష్టాలు తప్పవు. 130 కోట్ల ప్రజలతో భారీ మార్కెట్ ఉన్న భారతదేశాన్ని వదులుకోలేక అమెరికా ప్రభుత్వం ఇండియాకి సహాయం చేసేందుకు ఒప్పుకుందని నేషనల్ మీడియా కోడై కూస్తోంది.


తాజాగా నరేంద్ర మోడీ, జో బైడెన్ ఫోన్ కాల్ లో సంభాషించారని.. ఈ సంభాషణలో మోడీ 35 శాతం గ్లోబల్ షేర్ అనగా 2 కోట్లకు పైగా ఆస్ట్రాజెనెకా టీకాలను తమకు పంపిణీ చేయాలని గట్టిగా అడిగారని ఓ ఇండియన్ అధికారి చెప్పుకొచ్చారు.


వ్యాక్సిన్ పంపిణీ విషయంలో అమెరికా భారతదేశానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయని.. ప్రస్తుతం ఎన్ని టీకాలని ఇండియాకి పంపిణీ చేయాలో నిర్ణయించే పనిలో అమెరికా దేశం ఉందని.. అమెరికా అధికారులతో చర్చలు జరిపిన ఒక వ్యక్తి వెల్లడించారు.


ఇకపోతే ప్రపంచంలో అన్ని దేశాల్లో కెల్లా అత్యధిక వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం గల ఇండియా కొద్ది నెలల క్రితం అనగా సెకండ్ విజృంభించనప్పుడు.. 66 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఐతే ప్రస్తుతం రోజువారీ కేసులు 3 లక్షలు నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: