భారత్ వైపు దక్షిణ అమెరికా దృష్టి...?

Gullapally Venkatesh
భారత్ వైపు దక్షిణ అమెరికా దేశాలు చూస్తున్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి ఉత్తర అమెరికాతో చూస్తే దక్షిణ అమెరికా  చాలా రంగాల్లో వెనుకబడి ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్దికంగా చాలా దేశాలు ఇప్పుడు దక్షిణ అమెరికాలో చైతన్యం లేకుండానే ఉన్నాయి. అమెరికా పెట్టుబడులు పెట్గ్తే దేశాలు చాలానే ఉన్నాయి. అందుకే వెనుజులా దేశంలో భారీగా వనరులు ఉన్నా సరే  ఆర్ధిక మాంద్యం ఆ దేశాన్ని ఘోరంగా ఇబ్బంది పెడుతుంది. ఇక అక్కడి ఫార్మా రంగం కూడా చాలా వెనుకబడి ఉంది.
క్యూబా మినహా చాలా దేశాలు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల్లోనే ఉన్నాయి. ఫార్మా రంగంలో ఇతర దేశాల సహకారం కోసం చూస్తున్నాయి. అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారి విషయంలో దక్షిణ అమెరికా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. భారీగా వ్యాక్సిన్ కావాలి అనుకున్న దేశాలు మన దేశ విదేశాంగ, వైద్య ఆరోగ్య శాఖలతో చర్చలు జరుపుతున్నాయి. వేరే దేశాల్లో వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే భారత్ లో అయితే ఖర్చు చాలా వరకు తక్కువగా ఉంటుంది.
అందుకే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరపడానికి రెడీ అవుతున్నారు. చిలి, పేరు, వెనిజులా, అర్జెంటీనా వంటి దేశాలు మన వైపు చూస్తున్నాయి. ఇక ఇప్పటికే మన దేశం మీద రష్యా ఆధారపడుతుంది. ఈ నేపధ్యంలోనే ఈ దేశాలు కూడా తీవ్రంగా కష్టపడుతున్నాయి. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది చూడాలి. ఇక అప్పు ద్వారా కూడా వ్యాక్సిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆ దేశాల ప్రతినిధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్రిటన్, అమెరికా కూడా మన దేశం మీద ఆధారపడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: