ఒక్కో మహిళ ఖరీదు 2 లక్షలు, హైదరాబాద్ లో దారుణం...!

Gullapally Venkatesh
ఈ మధ్య కాలంలో మోసాలు చాలా రకాలుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నమ్మి మోసపోయే వారి సంఘటనలు విదేశాల్లో  పెద్ద పెద్ద ఉద్యోగాలు పేరుతో మోసపోయే వారి సంఘటనలు మనం ఎక్కువగానే చూస్తూ వస్తున్నాం. మన దేశంలో ఉపాధి లేని వారు చాలా మంది ఇతర దేశాల మీద ఆసక్తి చూపిస్తున్నారు.  తెలంగాణా ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్తున్నారు.  ఈ క్రమంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎం చేయాలో అర్ధం కాక జీవితాలను నాశనం చేసుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు అని చెప్పాలి.

చాలా మందికి ఇప్పుడు మోసాలు జరుగుతున్నా సరే ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. విదేశాలకు వెళ్లి చాలా మంది ఇప్పుడు అక్కడ కొంత మందిని నమ్మి ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. అయినా సరే మార్పులు రావడం లేదు అనే చెప్పాలి. కొంత మంది మోసపోయాం అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే ఉపయోగం లేకుండా పోతుంది అనే మాట చెప్పవచ్చు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఒక ఘటన ఆందోళన కలిగించింది. నమ్మి వెళ్లి నాశనం అయ్యారు.

హైదరాబాద్ పాతబస్తీలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌ లో మహిళలకు పని ఇప్పిస్తామంటూ మోసం చేసారు. ఒక్కో మహిళను రూ.2 లక్షలకు దుబాయ్ షేక్ లకు పాత బస్తీ బ్రోకర్ లు అమ్మేసారు. విజిటింగ్ వీసాలపై పంపి మహిళలను బ్రోకర్ లు అమ్ముకున్నారు. మొత్తం ఐదుగురు మహిళలను విక్రయించిన బ్రోకర్లు... మరికొంత మంది కోసం కూడా హైదరాబాద్ లో ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు బాధితుల బంధువులు ఫిర్యాదు చేసారు. పోలీసులకు కూడా  ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: