మోడీకి బిడెన్ దూరమే... కాకపోతే...!
బిడెన్... మోడీతో స్నేహం చేయకపోయినా సరే ఆయనతో దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాని భారత్ కి దగ్గరగా బిడెన్ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. రాజకీయ ప్రభావం దేశాల మధ్య ఉండకూడదు అని భావిస్తున్న బిడెన్ భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే... భారత్ అనేది అమెరికాకు అన్ని విధాలుగా అవసరం. కాబట్టి విదేశాంగ శాఖ ద్వారానే భారత్ తో స్నేహం చేయడం అలాగే వాణిజ్యం విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రాజకీయంగా ఇప్పుడు బిడెన్ చాలా శక్తివంతుడుగా కనిపిస్తున్నాడు. ఇటు భారత్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అలాగే కనపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు బిడెన్ చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లి... భారతీయులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమెరికాలో కరోనా వైరస్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్ తయారి విషయంలో భారత్ అవసరం అనేది అమెరికాకు ఉంది. కాబట్టి మోడీకి దగ్గరగా ఉండకుండా వాణిజ్యం ద్వారానే దేశానికి దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఎలా ఉంటారు ఏంటీ అనేది చూడాలి.