కరోనా వ్యాక్సిన్ కోసం ఆ రెండు దేశాలతో కేంద్రం...?

Gullapally Venkatesh
మన దేశంలో ఇప్పుడు  ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కరోనా తీవ్రత అనేది కాస్త తక్కువగానే ఉంది అనే చెప్పాలి. అయితే వచ్చేది చలికాలం కావడంతో కేసుల తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. కరోనా తీవ్రత విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా వరకు కూడా అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది. ఇక ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయంలో మన దేశం ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. అయితే కరోనా వ్యాక్సిన్ ఎలా అందిస్తారు ఏంటీ అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.
అసలు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు. అయితే మన దేశంలో కరోనా వ్యాక్సిన్ వస్తే జనాలకు పంపిణీ చేయడం అనేది చాలా ఇబ్బంది. ఈ నేపధ్యంలో అమెరికా, చైనా సహకారం తీసుకోవాలని కేంద్రం భావిస్తుంది. కరోనా పంపిణీ విషయంలో ఇప్పుడు కొంత మంది నిపుణుల బృందాలను తమ దేశానికి పంపాలి అని కేంద్రం వారిని కోరే అవకాశం ఉంది.  ఈ నేపధ్యంలోనే అమెరికా స్పందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో  మోడీ మాట్లాడే అవకాశం ఉంది అని చర్చలు జరుగుతున్నాయి.
త్వరలోనే ఆయనకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాలి అని మోడీ భావిస్తున్నారు. ఇక చైనా విషయంలో కూడా మన దేశం కాస్త జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ పంపిణీ అనేది చాలా వరకు కీలకం కానుంది. కాబట్టి కేంద్రం ఇప్పుడు చైనా ప్రభుత్వంతో చర్చలు జరిపి నిపుణుల బృందాలను  పంపమని కోరే అవకాశం ఉంది. అయితే చైనాతో సరిహద్దు తగాదాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మన దేశానికి ఆ దేశం సహకారం అందిస్తుందా అనేది చెప్పడం కష్టమే. ఇక రష్యా సహకారం కూడా కోరే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: