కమలా హారిస్ కు పోటీగా.. నిక్కీ హేలీని ప్రమోట్ చేస్తున్న ట్రంప్..!

Edari Rama Krishna
అమెరికాలో మరో నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికలకు సౌత్ కరోలినా మాజీ గవర్నర్, యునైటెడ్ నేషన్స్ మాజీ ప్రతినిధి నిక్కీ హేలీని ప్రమోట్ చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సౌత్ కరోలినా మాజీ గవర్నర్, యునైటెడ్ నేషన్స్ మాజీ ప్రతినిధి నిక్కీ హేలీని ప్రమోట్ చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. డెమోక్రాట్లు ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ కమలా హారిస్ ను ఎంపిక చేసి, ఆమెనే 2024 అధ్యక్ష ఎన్నికల్లో తమ తరఫున నిలపాలని భావిస్తున్న వేళ, భారత సంతతి మూలాలున్న, నిక్కీ హేలీ అయితే గట్టి పోటీ ఉంటుందని, గెలుపు అవకాశాలు కూడా ఉంటాయని రిపబ్లికన్లు భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో 2024లో అమెరికా అధ్యక్ష పదవికి ఇద్దరు భారత మూలాలున్న మహిళలు పోటీ పడేందుకు ఇప్పుడే అడుగులు పడ్డట్లయింది.
 రిపబ్లికన్ల నేషనల్ కన్వెన్షన్ ప్రారంభంకాగా, ప్రస్తుతమున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నే మరోమారు అదే పదవికి ఏకగ్రీవంగా సభ నామినేట్ చేసింది. అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు నిక్కీ హేలీని నామినేట్ చేయనున్నారని వార్తలు వచ్చినా, చివరకు మైక్ పెన్స్ కే మరోమారు అవకాశం ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ నిర్ణయించింది.  ఇదిలా ఉంటే..  భారత దేశంలో సిక్కుల మూలాలున్న నిక్కీ హేలీ, గతంలో సౌత్ కరోలినా గవర్నర్ గానూ పనిచేశారు. రెండు రోజుల క్రితం జరిగిన నేషనల్ కన్వెన్షన్ లో ఆమె ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది.  ఈ విషయంలో ఆమెను ట్రంప్ పొగడ్తలతో ముంచేశారు.


ఇక నిక్కీ మాట్లాడుతూ.. "అమెరికాలో జాత్యహంకారం ఉందని చెప్పడం అవాస్తవం. నా వరకూ నన్నే తీసుకోండి. నేను ఇండియా నుంచి వచ్చిన వలసదారుల అమ్మాయినని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఇదిలా ఉంటే.. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందిన మహిళ కాగా, నిక్కీ హేలీ తల్లిదండ్రులు అజిత్ సింగ్ రాంధావా, రాజ్ కౌర్ లు అమృతసర్ కు చెందిన వారు. 2024లో లేదా 2028లో రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి నిక్కీ హేలీ బరిలోకి దిగుతారని అంచనా వేస్తున్నట్టు యూసీ రివర్ సైడ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కార్తీక్ రామకృష్ణన్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: