అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్ర గవర్నర్ కెవిన్ స్టిట్ కి కరోనా
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్రర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 35,45,077 నమోదవ్వగా, మొత్తం 1,39,143 మంది కరోనాతో మరణించారు. కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇక బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్, మెక్సికో, లండన్ వంటి పలు దేశాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.
తాజాగా అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్ర గవర్నర్ కెవిన్ స్టిట్ కి కరోనా సోకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీకి హాజరైన రెండు వారాల తరువాత వైరస్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చినట్లు గవర్నర్ బుధవారం ప్రకటించారు. ఈ మద్య కాలంలో ఓక్లహోమాలో కేసులు పెరిగాయి. జూన్ లో ట్రంప్ నిర్వహించిన ఇండోర్ ర్యాలీతో పాటు ప్రజా నిరసనలు కేసుల పెరుగుదలకు దోహదపడ్డాయని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఇప్పటికే అగ్ర నేతలు సైతం కరోనా భారిన పడటమే కాదు.. కన్నుమూసిన సంఘటనలు కూడా జరిగాయి. కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన మొదటి యుఎస్ గవర్నర్ తాను అని గవర్నర్ కెవిన్ స్టిట్ చెప్పారు. 47 ఏళ్ల కెవిన్ కుటుంబానికి దూరంగా నిర్బంధంలో ఉన్నారు. వైరస్ నుండి విముక్తి పొందే వరకు ఇంటి నుండి పని చేస్తానని చెప్పాడు.