టిబెటన్ల టెన్షన్ తో చెన్నై.. నిఘా మరింత పటిష్టం చేసిన పోలీసులు

Sirini Sita
టిబెటన్లు చెన్నైలో జిన్‌పింగ్‌ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలకు ప్రయత్నించటం   పోలీస్ అధికారుల్ని  టెన్షన్‌లో ముంచింది . శుక్రవారం పలు చోట్ల దాక్కొని ,ఉన్న ఈ టిబెటన్లను గుర్తించడం  చాలా కష్టంగా మారింది. చైనీయుల ముసుగులో ఉన్న అనేక మంది టిబెటన్లను అతి కష్టం మీద చివరకు అరెస్టు చేయగలిగారు పోలీస్ అధికారులు. ఐటీసీ గ్రాండ్‌ హోటల్‌ చుట్టూ వున్న భద్రతా వలయాన్ని దాటుకొని మరి ఆరుగురు చొరబడడం  మరింత ఉత్కంఠకు దారి తీసింది.


తమ దేశం మీద చైనా ఆధిపత్యాన్ని సహించమని,నిరసిస్తూ టిబెటన్లు పోరాటాలు కొనసాగిస్తున్న వస్తున్న విషయం తెలిసిందే. చైనా మీద భగ్గుమనే టిబెటన్లకు ,చెన్నైకు వస్తున్న జిన్‌ పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు  ప్లాన్  చేశారని గత వారం నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో చెన్నై శివారులోని తాంబరంలో తిష్ట వేసి దాగి ఉన్న ఆరుగుర్ని అరెస్టు చేశారు. అలాగే, ఓకళాశాల ప్రొఫెసర్‌ను కూడా అదుపులోకి తీసుకొన్నారు.టిబెటన్లు చెన్నైలో ఎక్కువగా ఉన్న చోట్ల పోలీసులు డేగ కళ్లతో  నిఘా పెట్టారు.

వారి కదలికల మీద  జాగ్రత్తగా దృష్టి పెట్టారు. టిబెటన్ల నిరసనలకు ఆస్కారం ఇవ్వబోమనే  రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు. పోలిసుల కళ్లు గప్పి..మరో గంటన్నర వ్యవధిలో  జిన్‌పింగ్‌ ఫ్లైట్ చెన్నైలో ల్యాండ్‌ కానున్న సమయంలో, ఒక్క సారిగా ఉత్కంఠ మొదలయింది. మారు వేసి మరీ వేచిచూస్తున్న పోలీసులకే ముచ్చమటలు పట్టించారు... టిబెట్‌ యువతీ,యువకులు.

జిన్‌పింగ్‌ స్వాగతం పలికేందుకు వచ్చిన చైనీయుల ముసుగులో కొందరు టిబెటన్లు చొరబడడం అత్యంత టెన్షన్‌ రేపింది. ఇక, టిబెటన్ల మీద నిఘా మరింత పటిష్టం చేసి, పలు చోట్ల చైనీయులను సైతం పోలీసులు విచారించిన  అనంతరమే  అనుమతించాల్సి వచ్చింది. ఇక ఈసీఆర్‌ మార్గంలో అయితే,అనుమానంతో   ఏకంగా నలుగురు చైనా యువకులను అదుపులోకి తీసుకోక తప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: