“హిందువులకి”...క్షమాపణలు చెప్పిన “అమెరికా రిపబ్లికన్ పార్టీ”

NCH Nch

అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ హిందువుల ఓట్లని ఆకట్టుకోవాలని అనుకుంది అనుకున్నదే తడవుగా తాజాగా హిందువులు చేసుకున్న పండుగ అయిన వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని హిందువులని ఆకట్టుకోవాలని ఒక పత్రికా ప్రకటన చేసింది..అదే ఇప్పుడు ఆ పార్టీకి శాపం అయ్యింది కావాలని చేయకపోయినా దానిలో అర్థం మారిపోవడంతో తప్పయ్యింది బాబోయ్ అంటూ చివరికి  వేడుకుంది ఇంతకీ అసలేం జరిగింది అంటే..

 

టెక్సాస్ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా మైనారిటీ హిందూ ఓట్లను రాబట్టేందుకు వినాయక చవితిరోజు గణేశుని బొమ్మతో పత్రికల్లో ఒక యాడ్ విడుదల చేసింది..ఆ ప్రకటనలో వినాయకుని తల పెద్దది.. అంటే భిన్నంగా ఆలోచించే శక్తి ఉంటుంది...చెవులు పెద్దవి.. అంటే అందరు చెప్పేది సావధానంగా వింటాడు. ఇక బొజ్జ కూడా పెద్దదే. మంచి చెడ్డలు జీర్ణమైపోతాయి అని వివరించడానికి ఎన్నో తంటాలు పడ్డారు అయితే..

 

అన్ని బాగానే చెప్పిన సదరు పార్టీ చివరగా ఏనుగు, గాడిద రెంటిలో ఏది ఎంచుకుంటారు? నిర్ణయం మీదే. అని క్యాప్షన్ కూడా పెట్టారు...అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే...రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు. విపక్ష డెమొక్రాటిక్ పార్టీ గుర్తు గాడిద. ఇలా గణేశుని బొమ్మతో ప్రకటన చేయడమే కాకుండా  పిచ్చి క్యాప్షన్ కూడా పెట్టడం పట్ల హిందువుల మండిపడుతున్నారు. దాంతో నాలిక కరుచుకున్న రిపబ్లికన్ పార్టీ హిందువులు అందరికి క్షమాపణ కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: