సేల్ఫీ ఎఫెక్ట్..ప్రాణాలు పోగొట్టుకున్న “భారత విద్యార్ధి”
ఉన్నత చదువులకోసం విదేశాలు
వెళ్లి బాగా చదువుకుని మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని కలలు కన్న ఒక భారతీయ విద్యార్ధి
అనుకోని సంఘటన తో తనువు చాలించాడు..తాను చేసిన తప్పిదం వలన తన కన్న తల్లి తండ్రులకి
పుత్ర శోకం మిగిల్చాడు...వివరాలలోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో చదువుకుంటోన్న భారతీయ విద్యార్థి అంకిత్(20)..స్నేహితులతో కలిసి పోర్ట్ టౌన్‌కు వెళ్లాడు.
సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి గడపాలని అనుకున్న వాళ్ళు సేల్ఫీలు దిగుతూ ఉన్న సమయంలో మృతుడు అంకిత్సె..ల్ఫీ కోసం అందరూ అక్కడున్న రాళ్లమీదకి చేరారు.. అక్కడే ఉన్న 40 మీటర్ల ఎత్తైన, నిటారుగా ఉన్న ఓ రాయి మీద నుంచి సెల్ఫీ తీసుకుంటుండగా అంకిత్ కాలు జారి ఒక్కసారిగా సముద్రంలో పడిపోయాడు...ఈ సంఘటనతో అందరూ ఒక్క సారిగా ఉలిక్కపడ్డారు.
అయితే అంకిత్ చాలా జాగ్రత్తగా ఫోటోలు దిగుతున్నారు కానీ కాలు జారడం వల్లే ఇలా జరిగింది' అని
అంకిత్ స్నిహితులు తెలిపారు..సముద్రం నుంచి విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కన్నీరు మున్నీరు
అవుతున్నారు...అయితే అది చాల ప్రమాదకరమైన ప్రదేశం అని తెలిసినా కూడా వారు
అటువైపుగా వెళ్ళారని అక్కడ పోలీసులు చెప్తున్నారు..ఏది ఏమైనా సరే సేల్ఫీ మోజులో
పడి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది..ఇలాంటి ఎన్ని సంఘటనలు జరుగుతున్నా సరే
మళ్ళీ మళ్ళీ ఈ ఘటనలు పునరావృతం అవ్వడం ఎంతో భాధాకరం.