చరిత్ర సృష్టించిన “భారత మహిళా” ఎన్నారై
అమెరికాలో
భారతీయులు నమోదు చేసే రికార్డులు అన్నీ ఇన్నీ కావు..తాజాగా ఒక భారతీయ మహిళా ఎన్నారై నెలకొల్పిన రికార్డు
సంచలనం సృష్టించింది .. అమెరికాలో హౌస్ ఆఫ్
రిప్రజంటేటివ్స్ప్నిధిగా ఎంపికైన తొలి భారతీయ మహిళ గా సుశీల జైపాల్ చరిత్ర
సృష్టించింది..అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే
సుశీల జైపాల్ గతంలో అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్
ప్రతినిధిగా ఎంపికైన తొలి భారతీయ మహిళ ప్రమీల జైపాల్ చెల్లెలు.
సుశీలా ఆరెగన్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా ఎంపికై రికారులకేక్కారు..ఆరెగన్ రాష్ట్రంలోని మల్టనోమ్హా కౌంటీలో ఉత్తర, ఈశాన్య పోర్టుల్యాండ్ కమిషనర్‌గా ఆమె ఎన్నికయ్యారు. “57 శాతం” ఓట్లతో మా చెల్లెలు సుశీలా జైపాల్ ఒరెగాన్ రాష్ట్రంలో మల్టనోమ్హా కౌంటీ బోర్డు ఆఫ్ కమిషనర్స్లో సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు.. ఒరెగాన్‌లో ఎన్నికైన మొదటి దక్షిణాసియా అమెరికన్‌గా ఆమె రికార్డు నమోదు చేశారు’ అని పార్లమెంటు సభ్యురాలు ప్రమీల ట్వీట్ చేశారు.
అయితే సుశీలా జైపాల్ కి రాజకీయ అనుభవం అస్సలు లేకపోవడం ఇక్కడ కొసమెరుపు..గతంలో కార్పొరేట్ లాయర్‌గా పనిచేసి ఎంతో కాలంగా కమ్యూనిటీ వలంటీర్‌గా పనిచేస్తున్న సుశీల ఒక్క సారిగా రాజకీయ వేత్తగా మారిపోయారు..అయితే ఆమె యొక్క ప్రధాన లక్ష్యం ఇల్లు లేని పేదవారికి వారికి ఉండటానికి ఇల్లు సౌకర్యం కల్పించడమే అని తెలిపారు.. ఏది ఏమైనా భారత సంతతి వ్యక్తి పరాయి గడ్డపై సాధించిన విజయంతో అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.