“భారతీయులకి” శుభవార్త చెప్పిన ట్రంప్..

Bhavannarayana Nch

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా ప్రకటన భారతీయులకి మాత్రం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది..ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎంతో మంది భారతీయులు తన కృతజ్ఞతలు ట్రంప్ కి తెలియచేశారు ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని అలాంటి విధానాలు ఉంటేనే అమెరికాని ప్రధమ స్థానంలో ఉంచగలమని ట్రంప్ తెలిపారు..లాటరీ వీసా విధానాలకి స్వస్తి చెప్పనున్నారు..అంతేకాదు నిరంతర వలస విధానాన్ని చాల ఘాటు వ్యాఖ్యలు చేశారు..

 

 విభేదాలు పక్కన పెట్టి అందరు ఐక్యమత్యంగా ఉండాలని తెలిపారు..జాతి విద్వేషా కాల్పుల్లో మరణించిన కూచి బొట్ల శ్రీనివాస్ భార్య సునయన్ కూడా ఈ సభకి హాజరయ్యారు..అయితే ట్రంప్ ఈ సమయంలో చేసిన ప్రసంగం ఎంతో ఆకట్టు కుందని అంటున్నారు అంతేకాదు అమెరికాలో “అమెరికాలో శాశ్వత పౌరసభ్యత్వం ఇచ్చేందుకు అందించే గ్రీన్‌ కార్డులను ప్రతిభ ఆధారంగానే ఇవ్వాలి. ఎందుకంటే అమెరికాను ముందు వరసలో ఉంచడానికి అదొక్కటే మార్గం.


అని తెలిపారు..ఎవరు మన దేశాన్ని ప్రేమిస్తారో ఎవరు మన దేశాన్ని గౌరవిస్తారో వారికే మనం గ్రీన్ కార్డులు ఇవ్వాలని తెలిపారు..అయితే ట్రంప్ తాజా ప్రకటనతో భారతీయ ఎన్నారైలు..అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే వారికి మాత్రం ఎంతో తీపి కబురని చెప్పవచ్చు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: