ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు...!!

Shyam Rao

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను లండన్‌లో సోమవారం తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఘనంగా నిర్వహించింది. లండన్‌లోని వివిధ స్టేట్‌లకు చెందిన మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చేనేత లక్ష్మి పథకాన్ని ప్రోత్సాహించేందుకు మహిళలంతా చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు.



తెలంగాణ రాష్ట్రం నుంచి లండన్‌కు తీసుకువచ్చిన చేనేత వస్త్రాలను మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ మహిళ నాయకులు జయశ్రీ గంప, అంతటి మీనాక్షి, హేమలత, కాసర్ల జ్యోతి, శ్రీలక్ష్మి, వాణి, రమా, శ్రీవాణి, శిరీష, ప్రీతి, శౌరీ మచ్చ, జ్యోతిక, చందూగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: