ఆ దేశ ఎన్నికల్లో వేలుపెడుతున్న పుతిన్‌?

టర్కీలో ఎన్నికలు దగ్గర పడ్డాయని తెలుస్తుంది. అయితే అక్కడ  ఎడ్దోగన్ ఓటమి తప్పదు అని వినిపిస్తుంది. అక్కడ ఆరు పార్టీల కూటమికి సంబంధించిన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న కెమాల్ కిత్తో గోలు అధికారికంగా కన్ఫామ్ అయిపోయిన సందర్భం ఇప్పుడు. 2 నుండి 3 శాతం ఓట్ల తేడాతో ఆయన గెలుపొందే అవకాశం బాగా కనిపిస్తుంది అంటున్నారు. అయితే అతను తాజాగా ఎడ్దోగన్ పై కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది.

రష్యాకు మొన్ననే మద్దతు ప్రకటించాడు ఆయన. రష్యా మీద ఆంక్షలు  పెడుతున్న అమెరికా యూరప్ దేశాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనిపై ధన్యవాదాలు చెప్పినట్లుగా తెలుస్తుంది. మొన్న ఎడ్దోగన్ చేస్తున్నటువంటి లైవ్ లోకి వచ్చి మరీ ఆల్ ది బెస్ట్ చెప్పాడట. టర్కీలో ఎడ్దోగన్ ని గెలిపించడానికి ఇప్పుడు పుతిన్ వర్గాలు పూనుకున్నట్లుగా తెలుస్తుంది.

దాని నిమిత్తం 100-200 మంది ప్రతినిధులు రష్యా నుండి టర్కీకి వచ్చి ఎడ్దోగన్ ని గెలిపించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ మేరకు టర్కీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీల వాళ్లు దీనిపై ఇప్పుడు మాట్లాడుతున్నారన్నట్లుగా తెలుస్తుంది. టర్కీ రాజకీయాల్లో రష్యా జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బృందం. ఆ బృందానికి సంబంధించిన ప్రధానమంత్రి అభ్యర్థి ఈ ఆరోపణ చేసినట్లుగా తెలుస్తుంది.

అయితే ఈ ఆరోపణను రష్యా అధ్యక్షుడు ఖండించారు. మేము అటువంటి చర్యలు ఏమి చేయడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రష్యాకు సంబంధించిన క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దీనిపై అధికారకంగా ప్రకటించారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎడ్డోగన్ కి సపోర్ట్ చేయడం మాత్రం వాస్తవమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన పక్క దేశం ఏదైనా తన శత్రుదేశాన్ని తిడితే ఈ దేశానికి సంతోషం. తిట్టినందుకు ఆ దేశానితో స్నేహం చేస్తారు, అభినందిస్తారు. వాళ్లకి కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అండగా నిలుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: