‘బజ్రంగి భాయిజాన్' వెనుక కీరవాణి కీలక పాత్ర

Seetha Sailaja


ఈమధ్యన విడుదలైన  ‘బాహుబలి', ‘బజ్రంగి భాయిజాన్' కేవలం వారంరోజుల గ్యాప్ తో విడుదల  అయినప్పటికీ ఈరెండు సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు రచయితగా  విజయేంద్రప్రసాద్ వ్యవహరించడం మన తెలుగు రచయితల గొప్పతనంగా అందరూ భావిస్తూ ఉంటే ‘బజ్రంగి భాయిజాన్' ఘన విజయం వెనుక కీరవాణి పాత్రకు సంబంధించిన ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి. 

ఈ సినిమాకు సంబంధించి కీలక పాత్ర అయిన చిన్న అమ్మాయి హర్షాలి మల్హోత్రా పాత్రకు  సంబంధించి ఏదో ఒక దేశం నేపథ్యం ఎంచుకోవాలని రచయిత విజయేoద్రప్రసాద్ అనుకున్నాడట.  అయితే ఏదోఒక దేశం కాదు ఆ చిన్నఅమ్మాయి పాత్ర నేపధ్యం పాకిస్తాన్ అయితేనే ఆసినిమాకు సంబంధించి భావోద్వేగాలు బాగా పండుతాయని కీరవాణి సలహా ఇచ్చాడట. 

ఇదే సందర్భంలో మరో విషయాన్ని కూడా విజయేoద్రుడు లీక్ చేసాడు. ‘బాహుబలి’ క్లైమాక్స్ లో బాహుబలికి ఎంతో నమ్మకస్తుడైన కట్టప్ప అతన్ని పొడిచే సీన్ చూపెట్టి ‘బాహుబలి 2’ పై విపరీతమైన అంచనాలు పెంచిన సీన్ విషయంలో కూడ కీరవాణి సలహా సంప్రదింపులు ఉన్నాయని విజయేంద్ర ప్రసాద్ వివరించి మరో షాక్ ఇచ్చాడు. 

ఈవార్తలు ఇలా ఉండగా ‘బాహుబలి లాంటి’ విజువల్ వండర్ కు వచ్చిన గ్రాస్ కలెక్షన్లను కేవలం 14 రోజుల్లో అదిగమించి తన సత్తా ఏమిటో సల్మాన్ నిరూపించుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలికి’ 21రోజుల్లో 468 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా, ‘భజరంగి భాయిజాన్’ 14రోజుల్లో 495 కోట్ల గ్రాస్ తో ముందుకు దూసుకు వెళ్ళిపోతోంది.  ఏది ఎలా ఉన్నా ఈ రెండు సినిమాల ఘన విజయం వెనుక తెలుగు వారి మేధస్సులు ఉండటం మన తెలుగు వారందరికీ గర్వకారణం.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: