పవన్.. ఇంత అభిమానం తట్టుకోగలడా..!?

Chakravarthi Kalyan


సినీ హీరోలకు విజయం ఎంత ముఖ్యమో.. ఆదరించే అభిమానులూ అంతే ముఖ్యం.. ఒక విధంగా హీరో పదికాలాలు ఈ ఫీల్డ్ లో ఉండాలంటే.. విజయం కంటే అభిమాన గణమే ఇంకా ప్రధానం. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా దాంతో సంబంధం లేకుండా.. ఆదరించేవారే నిజమైన అభిమానులు.

మెగాపవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అలాంటి అభిమానలు ఎక్కువే. యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే ఈ హీరోకోసం.. అభిమానులు ఎలాంటి సాహసాలైనా చేస్తారు. ఈ సంగతి అద్దంకి రవి అనే అభిమాని మరోసారి రుజువు చేస్తున్నాడు. 

ఉద్యోగరీత్యా పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ లో ఉంటున్న ఈ అభిమాని పవన్ ను చూడాలని ఎప్పటి నుంచో తపనపడుతున్నాడు. సాధారణంగా హైదరాబాద్ వచ్చి చూస్తే ప్రత్యేకత ఏముంటుదనుకున్నాడో ఏమో.. ఖరగ్ పూర్ నుంచి సైకిల్ పైనే అభిమాన యాత్ర చేసుకుంటూ వస్తున్నాడు. రోజుకు 50 నుంచి 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ.. ప్రస్తుతం విశాఖ చేరుకున్నాడు.  

సైకిల్ యాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని.. తన అభిమాన తారను కళ్లారా చూసుకోవాలన్నది అద్దంకి రవి డ్రీమ్. పగలంతా సైకిల్ తొక్కుకుంటూ.. రాత్రిళ్లు బస్ షెల్టర్లలో విశ్రాంతి తీసుకుంటూ సాగుతున్న ఈ రవి అభిమాన యాత్ర త్వరలోనే హైదరాబాద్ చేరుకోబోతోంది. మరి పవన్ ఇతన్ని ఎలా ఆదరిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: