అఫిషియల్: శంకర్ ఐ రిలీజ డేట్ ఫిక్స్డ్

E. Rama Krishna
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్న క్రేజీ డైరెక్టర్ శంకర్. తాజాగా శంకర్ తెరకెక్కించిన ఐ మూవీ రిలీజ్ కోసం టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఐ అనేది ఇప్పుడు ఓ విజువల్ వండర్. ఇందులో శంకర్ ఏ తరహా గ్రాఫిక్స్ ని వాడాడు? వంటి టెక్నికల్ విషయాలుపై ఫిల్మ్ ఇండిస్ట్రీ ప్రత్యేక ఆసక్తిని చూపుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ విషయంలో అఫిషియల్ డేట్ బయటకు వచ్చింది. విక్రమ్ హీరోగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కించడంతో, బిటౌన్ మార్కెట్ సైతం ఐ మూవీపై ఆసక్తిని చూపుతుంది. అయితే ఈ విజువల్ వండర్‌ను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైలిమిటెడ్ సంస్థ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అధినేతలతో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ...‘శంకర్ తీర్చిదిద్దిన ‘ఐ'ని మేము తెలుగు ప్రేక్షకులకు మా మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. డిసెంబర్ నెలలో గ్రాండ్ గా ఫంక్షన్ నిర్వహించి ఆడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెస్తాము అని ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. చియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. వాస్తవానికి ఈచిత్రం ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉంది. అయితే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రీ రికార్డింగు పూర్తి కాక పోవడమే ఆలస్యానికి అంటున్నారు నిర్మాత. రీ-రికార్డింగ్ అదిరిపోవాలనే పట్టుదలతో రహమాన్ ఉన్నారు. అందుకని ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ చిత్రం విడుదలలో జాప్యం జరగడానికి ఇదే కారణం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేస్తాం'' అని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: