రెమ్యునరేషన్: పవన్ కోరిన 35 కోట్ల రూపాయలు

E. Rama Krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గబ్బర్ సింగ్2. అయితే ఈ మూవీకి సంబంధించిన కథ విషయంలో చాలా మార్పులు జరిగి, చివరకి పవన్ కోరుకున్న విధంగా కథ సిద్ధం అయింది. అంతే కాకుండా పవన్ ఆలోచనలకి సరిపోయే డైరెక్టర్ కూడ , తనకు దొరికాడు. సంపత్ నందితో చాలా తక్కువ సార్లు చర్ఛలు జరిపిపన పవన్ కళ్యాణ్, ఇప్పుడు డైరెక్టర్ ఛేంజ్ తరువాత కొత్త డైరెక్టర్ బాబితో చాలా సన్నిహిత చర్ఛలు జరుగుపుతున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ దాదాపు 35 కోట్ల రూపాయలుగా లెక్కలు తెలుస్తున్నాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కూడ గబ్బర్ సింగ్ 2లో భాగస్వామ్య నిర్మాత వ్యవహరిస్తున్నాడు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్2 మూవీకి వచ్చే రెమ్యునరేషన్ దాదాపు 35 కోట్ల రూపాయలు మించి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ, ఆంద్ర ప్రాంతాలలో రెండు ప్రాంతాలకి సంబంధించిన ఏరియా రైట్స్ ని పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ క్రింద తీసుకుంటున్నాడు. తెలంగాణలో నైజాం ఏరియా రైట్స్ లో పర్సంటేజీల కింద తీసుకంటున్నాడు. నైజాంలో వచ్చే కలెక్షన్స్ 60 శాతం పవన్ కి, మిగతా 40 శాతం నిర్మాతలకి అన్నట్టుగా టాలీవుడ్ టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఆంధ్రాలోనూ విజయవాడ రైట్స్ ని పవన్ కళ్యాణ్ పూర్తిగా తీసుకునే ఛాన్స్ ఉందంటూ బిజినెస్ వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: