చైనాను షేక్ చేస్తున్న ప్రభాస్ టాటూల క్రేజ్ !

Seetha Sailaja
‘బాహుబలి' విడుదల కాకుండానే మన తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్ల నుండి ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని మార్కెట్ రేట్లు పలుకుతూ సంచలనాలు చేస్తోంది అన్నది పాత విషయం. ఇప్పుడు ఈ సినిమాను చైనా జపాన్ భాషలలో కూడా డబ్ చేస్తూ ఉండటంతో అప్పుడే ఆ దేశాలలోని యూత్ కు ‘బాహుబలి’ ఫీవర్ తాకింది అనే వార్తలు వస్తున్నాయి.  గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ' చిత్రం చైనాలో ‘కుంగ్‌ఫు ఫ్లై' పేరుతో విడుదలై మంచి సక్సస్ ను పొందడంతో ‘బాహుబలి' సినిమాపై క్రేజ్ చైనాలో ఏర్పడటమే కాకుండా చాలామంది చైనా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు అనే టాక్ వినపడుతోంది. ఇప్పటికే చైనాలో ‘బాహుబలి’ సినిమా గురించి తెలిసిపోవడంతో కొందరు ప్రభాస్ టాటూలను కూడా తమ ఒంటిపై వేయించుకుంటున్నారట. కొన్ని పబ్బుల్లో కూడా ‘బాహుబలి' పోస్టర్లను ప్రమోట్ చేస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఒక తెలుగు సినిమాకు చైనా లో ఇటువంటి క్రేజ్ రావడం ఇదే మొదటిసారి.  రోజు రోజుకు పెరిగి పోతున్న బాహుబలి క్రేజ్ కు సంభందించిన వార్తలు చూస్తూ ఉంటే బాహుబలి 100 కోట్లు వసూలు చేసే సినిమాగా కాదు 150 కోట్లు వసూలు చేయబోయే తోలి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అని అనిపిస్తోంది. ప్రభాస్, రాజమౌళిల క్రేజ్ ఇలా చైనాను కుదిపి వేయడం తెలుగువారి సత్తాను చాటుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: