బిగ్ బాస్ లో స్నేహాలు తాత్కాలికమేనా?

Pranateja Sriram
బిగ్ బాస్ లో ప్రతీ కంటెస్టెంట్ ఒంటరిగానే వస్తారు. ఇంట్లోకి వచ్చాక వాళ్ళకి నచ్చే వారితో ఎక్కువ స్నేహంగా ఉంటారు. అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ల వల్ల ఒక్కోసారి తమకు నచ్చిన వారితోనే గొడవ పడాల్సి వస్తుంది. ఎవరికైనా వారి ఆట ముఖ్యం కాబట్టి వారు తప్పు చేశారని చెప్పలేం. వాళ్ల వ్యూహం ప్రకారం వాళ్ళు గేమ్ ఆడతారు. అయితే బిగ్ బాస్ లో స్నేహాలు తాత్కాలికమే అని అందరికీ తెలిసినప్పటికీ, కొన్ని కొన్ని స్నేహాలు బ్రేక్ అయినపుడు ప్రేక్షకులకి ఆశ్చర్యం కలుగక మానదు.


బాబా భాస్కర్, శ్రీముఖి ల మధ్య జరిగిన ఇష్యూ గురించి చూశాం. దాన్నెవరూ సీరియస్ గా తీసుకోలేరు. కానీ వరుణ్, రాహల్ ల మధ్య జరిగిన దాన్ని మాత్రం అలా తేలిగ్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే, బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాం కంటెస్టెంట్స్ అయిన రాహుల్, వరుణ్ లు నిన్నటి వరకు చాలా స్నేహంగా ఉన్నారు. కానీ నిన్న జరిగిన గొడవ ద్వారా వారు కూడా అందరి లాంటి వారే అని నిరూపించారు. అయితే నిన్నటి గొడవలో ఇద్దరి తప్పులు ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో వరుణ్ ఆవేశంలో పొరపాటు చేశాడని అనిపిస్తుంది.


అక్కడ ఏం జరిగిందో మాట్లాడకుండా గతంలో రాహుల్ చేసిన తప్పులని ఎత్తి చూపాడు. ఇక్కడే వరుణ్ తప్పు చేశాడని అనిపిస్తుంది. అంతే కాదు నీ ఆటిట్యూడ్ గురించి నాకు తెలుసు అంటాడు. మూడు రోజుల క్రితమే రాహుల్ గురించి పొగిడి, అవుతున్నాడంటే ఏడ్చిన వరుణ్ కేవలం టాస్క్ కోసమే ఇదంతా చేశాడా అనిపిస్తుంది. అయితే రాహుల్ కుడా అంతలా అరవాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నోటిని కంట్రోల్ లో పెట్టుకోకపోవడం అతనికి పెద్ద మైనస్.


రాహుల్ తప్పు చేసినప్పటికీ, గతం గురించి మాత్రం తవ్వలేదు. ఇక్కడి వరకు కొంచెం ఫర్వాలేదు అని చెప్పవచ్చు. ఒకవేళ రాహుల్ కూడా వరుణ్ గతంలో చేసిన తప్పులని ముందుకు తెస్తే, గొడవ మరింత పెద్దగా జరిగేది. ఇదంతా చూస్తుంటే ఎంత మంచి స్నేహమైనా బిగ్ బాస్ దెబ్బకు ఏదో ఒకరోజు బ్రేక్ అవ్వాల్సిందే అని స్పష్టం అవుతుంది. మరి వీరు తమ తప్పులు తెలుసుకుని, మళ్ళీ మునుపటిలాగా స్నేహంగా ఉంటారా లేదా అన్నది సందేహమే!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: