అప్పుడు గబ్బర్ సింగ్ ... ఇప్పుడు గద్దలకొండ గణేష్
ఇక ఇప్పుడు చాలా రోజుల తరువాత కోలీవుడ్ లో విజయం సాధించిన జిగర్ తండా ను హరీష్ తెలుగులో గద్దలకొండ గణేష్ పేరు తో రీమేక్ చేశాడు. వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. గబ్బర్ సింగ్ లాగానే రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెలుగు నేటివిటీ కి తగ్గట్లు తనదైన మార్క్ కామెడీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు హరీష్ శంకర్.. ఫలితంగా ఈ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే విడుదలై ఒక్క రోజు కూడా కాకముందే బ్లాక్ బాస్లర్ అని చెప్పడం అతిగానే ఉంటుంది కానీ వరుణ్ నటించిన గత చిత్రాలు ఫిదా ,తొలిప్రేమ ,ఎఫ్ 2కు హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ లో వసూళ్లను సాధించాయో మనం చూశాం. మరో ఇప్పుడు ఏకంగా గద్దలకొండ గణేష్ కు బ్లాక్ బాస్టర్ టాకే వస్తుంది. దాంతో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాదిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదేమో.