ఆయన వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావట్లేదా..?

praveen
విలన్ పాత్రైనా ... తండి పాత్రైనా...ఇలా నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రం అయినా డైరెక్టర్లకు వన్ ఓన్లీ ఛాయస్ ప్రకాష్ రాజ్ . ఎలాంటి పాత్రలోనైనా ఒదిగి పోయే విలక్షణ నటుడు ప్రకాష్  రాజ్ . వివిధ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి నటనలో తనదో సెపెరేట్ స్టైల్ అని ప్రూవ్ చేసాడు ప్రకాష్ రాజ్ . ఒకప్పుడు ఏ సినిమాలో చుసిన ప్రకాష్ రాజ్ కనిపించే వాడు . కానీ గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ ఊసే లేదు . అసలు ఏ సినిమాలో కనిపియ్యకుండా కనుమరుగయ్యారు . డైరెక్టర్లకు కూడా ప్రకాష్ రాజ్ నటన బోర్ కొట్టేసినట్టుంది దీంతో ఆఫర్ కూడా అంతగా ఇవ్వటం లేదు .


మరి ప్రకాష్ రాజ్ లాంటి విలక్షణమైన నటుడు ... ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు సినిమా ఇండస్ట్రీ ఎక్కడ దొరుకుతాడు అనుకుంటున్నా తరుణంలో ... అంతకు మించిన నటుడే దొరికాడు ఇప్పుడు . గత రెండు మూడేళ్ళుగా ఏ సినిమాలో చుసిన ఎదో ఒక ఇంపార్టెంట్ రోల్లో ఆకట్టుకుంటూనే ఉన్నాడు . అయన ఇంకెవరో కాదు బాలీవుడ్ నటుడు మురళి శర్మ .హిందీ నటుడయినప్పటికీ తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా వినిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు . విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ... ప్రకాష్  రాజ్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు . సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇచ్చిన ఆ  పాత్రకు మురళి  శర్మ తప్ప వేరే వాళ్ళు చేయలేరు. అనేంతగా పాత్రలను ప్రభావిత్తం చేస్తున్నాడు ఈయన .నీట్ అండ్ క్లిన్ గా ఉండే ఆయన నటనకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా నిన్ను వీడను నేనే ,ఎవరు , సాహూ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు మురళి శర్మ .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: