హాలీవుడ్ తర్వాత ఆ ఘనత సాహోదే

Pranateja Sriram
ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ళ పరంగా దూసుకుపోతుంది. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు వచ్చిన స్పందనని చూస్తే రెండో రోజుకే డీలా పడిపోతుందని అందరూ భావించారు. పూర్తి నెగెటివ్ పబ్లిసిటీ వచ్చినప్పటికీ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా సినిమా దూసుకుపోతుంది. ఇటు నైజాంలో సినిమా బాగా రన్ అవుతుంది. అలాగే హిందీలో కూడా సాహోకి వసూళ్ళు బాగా వస్తున్నాయి.


విమర్శకులు ఘోరంగా విమర్శించినప్పటికీ వసూళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నారు.బాలీవుడ్ లో కొన్ని ఏరియాల్లో సాహో లాభాల్ని పంచే దిశగా వెళ్తుంది. ఈ విధంగా చూస్తే ప్రభాస్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు. రజనీకాంత్ తర్వాత ప్రభాస్ ఒక్కడికే అంతటి స్టార్ డమ్ దక్కింది. అయితే సాహో సినిమా మరో ఘనతని తన ఖాతాలొ వేసుకుంది.


సినిమా పరాజయం పాలైనా, వసూళ్ళ పరంగా సినిమా స్థాయి టాప్ లో ఉంది. వసూళ్ళు బాక్సాఫీసు దుమ్ము దులుపుతున్నాయి.అది కూడా మాములుగా కాదు ఏకంగా హాలీవుడ్ చిత్రం తర్వాత సాహో నే అత్యధిక కలెక్షన్లు సాధించే విధంగా అంటే ఆశ్చర్యం వేయక మానదు.వీకెండ్ మూడు నాలుగు రోజుల్లోనే రూ.350 కోట్ల వసూళ్లను సాధించిడం ఇప్పటి వరకు ఏ హీరోకు సాధ్యం కాలేదు. వరల్డ్ వైడ్‌గా వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా ‘సాహో’ నిలిచింది.


ఈ లిస్టులో హాలీవుడ్ చిత్రం ‘హాబ్స్ అండ్ షా’ ఉంది. తర్వాతి స్థానాల్లో ‘ది లయన్ కింగ్’‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’, ‘ఏంజల్ హ్యాస్ ఫాలెన్’ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ‘సాహో’ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో..అని అంత లెక్కలు వేసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: