రామ్ తన పాత సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడా ...? హీరోయిన్ ఆమెనా...??
ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ సీక్వెల్ కి 'రెడీ' అంటున్నాడు. తనకు హిట్ అందించిన ఆ పాత సినిమా హీరోయిన్ తోనే ఈ సీక్వెల్ చిత్రం లో నటిస్తాడంట. రామ్ కెరియర్ లో ప్రత్యేకం గా నిలిచిన చిత్రా లలో 'రేడి' ఒకటి. పదకొండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా హిట్ అయ్యి వసూళ్ళ వర్షం కురిపించిన ఈ సినిమా కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగతోంది.
రెడీ లో కథానాయిక గా నటించిన జెనీలియా ఈ కొనసాగింపు చిత్రం లోనూ సందడి చేయనుందట అయితే దర్శకుడెవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రెడీ సీక్వెల్ కు సంబంధించిన వివరాలు జనీలియా భర్త నటుడు రితీష్ దేశ్ ముఖ్ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పొస్ట్ చేశాడు.
రెండ్రోజుల క్రితం జరిగినా జెనీలియా బర్త్ డే పార్టీ కి రామ్ హాజరయ్యాడు. ఈ సందర్భం గా రితీష్ " ఇస్మార్ట్ శంకర్ రామ్ వెరీస్మార్ట్ జనితో స్మార్ట్ రితీష్" అంటూ వేడుక కు హాజరైన రామ్ కి కృతజ్ఞతలు తెలిపాడు. రామ్ జెనీలియాకు పుట్టిన రోజు సుభాకాంక్షలు తెలపడానికే వెల్లాడని అందరూ అనుకున్నారు.
కానీ ఊహించని విధంగా మరో పోస్ట్ లో " రెడీ 2 అల్రెడీ " అంటూ సీక్వెల్ కి సంబంధించిన ఒక క్లూ ఇచ్చాడు రితీష్. దాదాపు ఒక పుష్కరం తరువాత వారిద్దరు మళ్ళి కలిసి నటించబోతున్నారు. అప్పట్లో విడుదలైన రెడీ సినిమా ఎన్ని రికార్డులకు తెర తీసిందో మన మందరం చూశాము. దానిని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ రీమేక్ కూడా తీశారు. మరీ ఇప్పుడు తీయబోయే రెడీ2 కూడా రెడీ లాగే ఈ సీక్వెల్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో వేచి చూడాలి.