ఆగష్టు 9 న మహేష్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్..!!

Balachander
ఆగస్టు 9 వ తేదీ మహేష్ పుట్టినరోజు.  ఆరోజున మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ బయటకు రావొచ్చు.  ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది.  మహర్షి సినిమాలో ఫస్ట్ లుక్ టీజర్ ను ఎలా రిలీజ్ చేశారో... ఈ సినిమాలో కూడా అలాంటి మ్యూజికల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్.  



ఈ మూవీకి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.  మహేష్ చాలా సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు.  చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  అయితే, గత కొంతకాలాగా దేవిశ్రీ బాణీలు సరిగా ఉండటం లేదని, ఫ్యాన్స్ మెప్పించే విధంగా ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నారని టాక్.  మహేష్ మాత్రం పట్టుబట్టి దేవిశ్రీతోనే సినిమా చేయాలని అనుకున్నారు.  మహేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని దేవిశ్రీ మరోసారి నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు.  


వచ్చిన ఆఫర్లను పక్కన పెట్టి ముందు మహేష్ సినిమా ఫినిష్ చేసి తిరిగి ట్రాక్ లోకి రావాలని దేవిశ్రీ అనుకుంటున్నాడు.  ఈ మూవీ కోసం ఇప్పటికే దేవిశ్రీ రెండు అదిరిపోయే ట్రాక్స్ ఇచ్చారని తెలుస్తోంది.  మహేష్ ఇంట్రో, లవ్ సాంగ్స్ రెడీ అయ్యాయని సమాచారం.  ఆగస్ట్ 9 వ తేదీన మహేష్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ ఫస్ట్ లుక్ తో పాటు చిన్న టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం.  ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు.  రష్మిక మందన్న హీరోయిన్.  విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది.  



ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటోంది.  అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ట్రైన్ సెట్ లో షూట్ చేస్తున్నారు. రామోజీఫిల్మ్ సిటీలో కొండారెడ్డి బురుజుకు సంబంధించిన సెట్ ను నిర్మించారు.  అక్కడ కూడా షూటింగ్ చేస్తారట.  వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసుకొని సినిమా రిలీజ్ కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: