భారతీయుడు2 చిత్రం ఆగిపోలేదు.

kiran Roop

తెలుగు హీరోయిన్ లలో అతి తక్కువ కాలంలో టాప్ స్థాయికి చేరుకున్న హీరోయిన్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. అయితే కొంత కాలంగా కథ వేరేలా ఉంది రకుల్ ప్రీత్ కి అవకాశాలు విపరీతంగా తగ్గాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత రకుల్ కు బాగా తెలుసు, అందుకే స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే  వెనకేసుకున్న 4 రాళ్లతో ఫిట్ నెస్ సెంటర్ లు పెట్టేసింది.
 
ప్రస్తుతం రకుల్ ప్రీత్ మన్మథుడు 2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విజయం సాధిస్తేనే రకుల్ కి టాలీవుడ్ లో లైఫ్ ఉంటుంది అనుకున్నారు అందరూ కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓ భారీ ఆఫర్ ను కొట్టేసింది రకుల్.

శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2చిత్రంలో నటించే అవకాశం వచ్చింది రకుల్ కు.దర్శకుడు శంకర్ రకుల్ ని కలిసి మాట్లాడినట్టు రకుల్ ఈ చిత్రానికి ఒకే చెప్పినట్టు సమాచారం.అయితే ఇప్పటి వరకు భారతీయుడు సినిమా ఆపేశారు రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారు అనే వార్త రాగానే కమలహాసన్ అభిమానుల్లో మళ్ళీ సినిమా ప్రారంభిస్తున్నారు అనే సందడి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: