అయ్యో.. ఈ బూతు సినిమా భరద్వాజగారికి అవసరమా !
టాలీవుడ్ లో తమ్మారెడ్డి భరద్వాజ అంటే ఓ పెద్ద మనిషి. పైగా మంచి చెడ్డలు చెప్పే అలవాటు ఉన్న ఆయన.. ఏ ఉద్దేశ్యంతో ఓ డబ్బింగ్ సినిమా రైట్స్ కొనుక్కొని విడుదల చేస్తున్నారో గాని.. ఇప్పుడు అది ఆయనకు ఉన్న పేరు కూడా పోగెట్టేలా ఉంది. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. అమలాపాల్ ప్రస్తుతం ''ఆడై'' అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. ‘ఆమె’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.
కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో అమలాపాల్ మరీ బోల్డ్ గా కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది. ట్రైలర్ లో ముఖ్యంగా.. చివర్లో వచ్చే అమలాపాల్ న్యూడ్ షాట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో కామిని అనే పాత్రలో నటిస్తున్న అమలా పాల్, కొన్ని దారుణమైన పరిస్థితుల నుండి ఎలా బయటపడగలిగింది అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. ఏమైనా సినిమాలో మాత్రం న్యూడ్ షాట్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. మరి ఈ బూతు సినిమా తమ్మారెడ్డి భరద్వాజగారికి అవసరమా.