నవదీప్ ప్లానింగ్ అద్దిరింది గా !
ఇటువంటి క్రమంలో తాజాగా ఇంస్టాగ్రామ్ లో నవదీప్ ఫుల్ బాడీ వర్క్ ఔట్ లో ఉన్న ఒక ఫోటో అప్లోడ్ చేసి అందరికీ సర్ ప్రైజ్ షాకిచ్చాడు. నవదీప్ మొదటి నుంచి ఫిట్నెస్ కాన్షియస్ పర్సనే కానీ బిగ్ బాస్ టైమ్ లో మాత్రం కాస్త వెయిట్ పెరిగాడు. ఇప్పుడు నవదీప్ కొత్త లుక్ చూస్తే మాత్రం ఎవరైనా స్టన్ అవ్వాల్సిందే. నవదీప్ తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఈ ఫోటో సూపర్ ఫిట్ గా కండల వీరుడి తరహాలో కనిపించడం విశేషం.
గ్రే కలర్ స్పోర్ట్స్ వేర్ ధరించి జిమ్ లో తీసుకున్న సెల్ఫీ. హెయిర్ క్లిప్.. లైట్ గా గడ్డంతో బాలీవుడ్ స్టైల్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. నెటిజన్లు ఈ ఫోటోకు పొగడ్తల వర్షం కురిపించారు. 'టాలీవుడ్ సల్మాన్ ఖాన్' అని కూడా ఒకరు.. 'కెప్టెన్ అమెరికా' అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరికొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారు త్వరలో నవదీప్ విలన్ వేషాలు వేయటానికి వేసిన ప్లాన్ ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.