స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ మధ్యలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఓ కార్వాన్ కొనుగోలు చేశాడు. సకల సదుపాయాలతో లగ్జరీని ఒలకబోస్తున్న ఈ కార్వాన్ను ‘ఫాల్కన్’ అని పేరు పెట్టుకున్నాడు. ఫాల్కన్ ఫొటోలను షేర్ చేసిన బన్నీ.
‘‘నా జీవితంలో పెద్దది ఏదైనా కొనుగోలు చేసిన ప్రతిసారీ.. నా మనసులో ఓ ఆలోచన మెదులుతుంది. మీ ప్రేమ వల్లే ఇది సాధ్యమైందనుకుంటా. అభిమానుల ప్రేమ బలమైంది. అందుకే నేను ఇవన్నీ కొనుగోలు చేయగలుగుతున్నా. థ్యాంక్యూ ఆల్. ఇదే నా వానిటీ వ్యాన్ ఫాల్కన్’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
బ్లాక్ కలర్లో ఉన్న ఫాల్కన్ లుక్ అదిరిపోయేలా ఉంది. రూ.3.5 కోట్లతో ఈ లగ్జరీ కార్వాన్ను కొనుగోలు చేసిన బన్నీ.. మరో మూడున్నర కోట్లు పెట్టి ముంబైకి చెందిన ఓ ఆటోమోటివ్ డిజైనర్‌తో తనకు అవసరమైనట్టుగా మార్పులు చేయించుకున్నాడట. లెదర్ సీట్లు, భారీ అద్దం, అద్భుతమైన లైటింగ్, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్లతో ఈ వానిటీ వాన్ అద్భుతంగా ఉంది. ఈ కార్ వాన్‌పై అల్లు అర్జున్ సిగ్నేచర్ లోగో AAను బయట వైపు స్టైలిష్‌గా రాశారు.