తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలికి ఒక మంచి పేరు ఉన్నది. ఏ ప్రాంతీయ సినిమాకు సాధ్యంకాని రికార్డులను బాహుబలి సాధించింది. ఏకంగా 2000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి శభాష్ అనిపించుకుంది. వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో సినిమాను ప్రదర్శించారు.
ఇప్పుడు దేశంలో భారీ నిర్మాణంతో సినిమాలు తీస్తే.. దానిని బాహుబలి తో పోలుస్తున్నారు. బాహుబలి లాగానే హిట్ కొడుతుందా.. బాహుబలి రికార్డులను తిరగరాస్తుందా.. బాహుబలిని మించేలా ఉంటుందా అనే కథనాలు వస్తుంటాయి. ఇలాంటి కథనాలే ప్రభాస్ సాహో విషయంలోనూ వస్తున్నాయి.
సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సాహో సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే సెన్సషనల్ రికార్డులను సొంతం చేసుకుంది. ఆగష్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. ఇప్పుడు సినీప్రియుల దృష్టి మొత్తం ఈ సినిమాపైనే ఉన్నది.
దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని బాహుబలితో పోలుస్తున్నారు. ఆలా చెయ్యొద్దని సుజిత్ అంటున్నాడు. బాహుబలి సినిమా వేరు.. ఈ సినిమా వేరు అని. దానితో పోల్చి చూడొద్దని అంటున్నాడు. అభిమానులు కోరుకున్నట్టుగా సినిమా ఉంటుందని అంటున్నాడు.