విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా చూసిన తరువాత సినిమాల్లో ముద్దు సీన్లు కామన్ అయ్యాయి. ఆ తరువాత ఆర్ఎక్స్ 100 .. ఇప్పుడు మన్మధుడు 2 సినిమాలు ముద్దు సీన్లు చాలా కామన్ అనే అభిప్రాయం వచ్చింది. కానీ, బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో.. ఇలా చేయాలి అంటే ఆలోచించేవారు.
ఇలా చేయడమే కాదు.. అసలు అలాంటి సీన్లు పెట్టాలి అంటేనే భయపడిపోయేవారు దర్శక నిర్మాతలు. కథ డిమాండ్ మేరకు అలాంటివి పెట్టాల్సి వస్తే.. చెట్టు చాటునో పొదల చాటునో హీరో హీరోయిన్లు వెళ్లారు.. అక్కడి ఆకులు అలా ఊగుతాయి..
అలా ఆ సీన్ అయిపోయినట్టు చూపించేవారు. కలర్ సినిమాలు వచ్చే వరకు ముద్దు సీన్లు లేవా అంటే ఉన్నాయి. 90 ఏళ్ల క్రితమే ముద్దు సీన్స్ తో సినిమా వచ్చింది. అది మూకీ సినిమా. 1929లో ఏ థ్రో ఆఫ్ డైస్ అనే సినిమా వచ్చింది. ఇందులో హీరో హీరోయిన్లు కొన్ని క్షణాల పాటు అదర చుంబనం ఉంటుంది.
కానీ, అప్పట్లో ఎక్కువ సమయం ముద్దు సీన్ ఉన్న సినిమా 1930 లో వచ్చిన కర్మ లోనిది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య నాలుగు నిమిషాల పాటు ముద్దు సీన్ ఉంటుంది. దేవికారాణి, హిమాన్షు రాయ్ లు ఈ సినిమాలో నటించారు. ఈ ఇద్దరు నిజజీవితంలో భార్య భర్తలు కావడం విశేషం.