సింగిల్ గానే షూటింగ్ కి వెళ్ళిపోతున్నా అక్కినేని అఖిల్..!
అయితే ఇక్కడ డైరెక్టర్ భాస్కర్ కి గత కొంత కాలం నుండి సరైన హిట్టు లేకపోయినా ఆయన చెప్పిన కథకు కమిట్మెంట్ అయ్యి డేంజర్ లో ఉన్న కెరియర్ తో ప్రయోగాత్మకంగా సినిమాని ఒప్పుకోవడం ఆశ్చర్యమే అని చెప్పవచ్చు. భాస్కర్ స్క్రిప్ట్ ను నమ్మిన అఖిల్ ఈ నెల 24న సినిమాను లాంచ్ చేయడానికి సిద్దమయ్యాడు. రెగ్యులర్ షూటింగ్ ని జూన్ లో స్టార్ట్ చేయనున్నాడు.
అయితే ఇంకా అఖిల్ సరసన హీరోయిన్ సెట్టవ్వలేదు. కీర్తి సురేష్ ని ఇటీవల ఫైనల్ చేద్దామని అనుకున్నారట. అయితే ఆమె అఖిల్ కంటే పెద్దగా కనిపిస్తుందని వద్దనుకున్నారు. ఇక రశ్మిక మందన్న - కియారా అద్వానీ లాంటి బిజీగా ఉన్న హీరోయిన్స్ ని సెలెక్ట్ చేద్దామనుకుంటే వాళ్లు ఇప్పట్లో దొరికేలా లేరు. ఫైనల్ గా కొత్త హీరోయిన్ నే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ దొరికే వరకు మొదటి షెడ్యూల్ లో అఖిల్ కి సంబందించిన మెయిన్ సీన్స్ ను దర్శకుడు ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా అఖిల్ హీరోయిన్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు.