తన డ్రీమ్ నెరవేర్చుకున్న సూర్య…!

KSK
సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్న  హీరో సూర్య. ఇదిలావుండగా అప్పట్లో 2002వ సంవత్సరంలో సెవెన్ బై జి అనే సినిమాకు దర్శకత్వం వహించిన సెల్వా రాఘవన్ తో సినిమా చేయాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి లో అనుకున్నాడట సూర్య. గత కొంతకాలంగా కొత్త ప్రయత్నాలతో ట్రై చేసినా కుదరని వీరిద్దరి కాంబినేషన్...తాజాగా ఇటీవల NGK అనే పొలిటికల్ థ్రిల్లర్ తో ఒకటయ్యారు.


16 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో  వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. 7/g బృందావన కాలనీ - ఆడవారి మాటలకూ అర్దాలే వేరులే - యుగానికి ఒక్కడు వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సెల్వ మొదట్లో కాదల్ కొండేన్(2002) అనే సినిమాతో ఇండస్ట్రీని ఆకర్షించాడు. తెలుగులో 'నేను' టైటిల్ తో అల్లరి నరేష్ హీరోగా ఆ సినిమాను రీమేక్ చేశారు.


అయితే కాదల్ కొండెన్ మేకింగ్ కి ఫిదా అయిన సూర్య 2002లో మనమిద్దరం ఒక సినిమా చేద్దామని సెల్వా రాఘవన్ ని అడిగాడు. సూర్యకి తగ్గట్టుగా స్క్రిప్ట్ ను సెల్వా అప్పట్లో రెడీ చేయలేకపోయాడు. ఫైనల్ గా ఇప్పుడు NGKతో కలిశారు. మొత్తం మీద సెల్వ రాఘవన్ తో సినిమా చేయాలని సూర్య ఏర్పరుచుకున్న తన డ్రీమ్ ఎల్ జి కే సినిమాతో తిరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మే 31న రిలీజ్ కాబోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: