హద్దులు దాటుతున్న డియర్ కామ్రేడ్ !

Seetha Sailaja
ఈ సమ్మర్ రేస్ కు ఎన్ని సినిమాలు విడుదల అయినా ‘మహర్షి’ ‘డియర్ కామ్రేడ్’ మూవీల మధ్య మాత్రమే నిజమైన పోటీ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ‘డియర్ కామ్రేడ్’ మూవీకి పెట్టిన భారీ బడ్జెట్ ఆ సినిమాకు శాపంగా మారుతుందా అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

‘గీత గోవిందం’ మూవీ 70 కోట్ల నెట్ కలక్షన్స్ ను సాధించిన నేపధ్యంలో ‘డియర్ కామ్రేడ్’ పై ఆమూవీ మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమా షూటింగ్ కోసం ఒక భారీ కాలేజ్ సెట్ ను నిర్మించడమే కాకుండా అనేక ప్రాంతాలలో ఈమూవీని షూట్ చేయడంతో పాటు ఈమూవీని అనేకసార్లు రీ  షూట్ చేయడంతో ఈమూవీ బడ్జెట్ పెరిగి పోయింది అని అంటున్నారు.

విజయ్ దేవరకొండకు కొనసాగుతున్న మ్యానియా రీత్యా ఈమూవీ మార్కెట్ కు సమస్యలు లేకపోయినా విజయ్ దేవరకొండ నటించిన అన్ని సినిమాలు ‘గీత గోవిందం’ స్థాయిలో హిట్ అవ్వని పరిస్థుతులలో డియర్ కామ్రేడ్ పై మితిమీరిన విశ్వాసం ప్రదర్శిస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీ బడ్జెట్ పెరిగి పోవడంతో ఎక్కువ రేట్లకు ఈమూవీని అమ్మవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇది ఇలా ఉంటే ఈమూవీ సమ్మర్ రేస్ లో కాకుండా సమ్మర్ పూర్తి అయ్యాక విడుదల అయ్యే పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. ఈమూవీని మే 31న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసినా ఆ డేట్ కు సూర్య నటించిన ‘NGK’ విక్రమ్ నటించిన ‘కదరం కొండన్’ తమిళంలో విడుదల అవుతున్న నేపద్యంలో ఇద్దరు టాప్ హీరోలతో ‘డియర్ కామ్రేడ్’ ను తమిళంలో అదే డేట్ కు విడుదల చేస్తే ఆమూవీని ఎవరు పట్టించుకోరు అన్న అభిప్రాయంతో ‘డియర్ కామ్రేడ్’ ను జూన్ రెండవ వారంలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: