మహానాయకుడు మహాడ్రామాతో అయోమయంలో బాలకృష్ణ

Seetha Sailaja
ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం ‘మహానాయకుడు’ విడుదలకు వచ్చే వారంలో లైన్ క్లియర్ కావడంతో ఈమూవీ విడుదల కాకుండానే మహా డ్రామా మొదలుకాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘కథానాయకుడు’ మూవీతో సుమారు 40 కోట్లకు పైగా నష్టపోయిన బయ్యర్లకు ‘మహానాయకుడు’ మూవీని ఉచితంగా ఇస్తారు అనే వార్తలు వచ్చాయి.

అయితే జరుగుతున్న పరిణామాలు వేరు అని ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘కథానాయకుడు’ మూవీని కొనుక్కుని భారీగా నష్టపోయిన బయ్యర్లకు ‘మహానాయకుడు’ ను తగ్గించిన రేట్లకు ఇస్తాము కాని పూర్తిగా ఉచితంగా ఇవ్వము అన్న సంకేతాలు బాలకృష్ణ సన్నిహితుల నుండి అందుతున్నట్లు టాక్. 

దీనితో ఈ విషయాలు బాలకృష్ణ దృష్టి వరకు తీసుకు వద్దామని ‘కథానాయకుడు’ బయ్యర్లు ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ‘మహానాయకుడు’ మూవీని టోటల్ గా సురేశ్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తారు అని వస్తున్న వార్తలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. 

ఈ పరిణామాలతో ‘కథానాయకుడు’ తో నష్టపోయిన బయ్యర్లు ‘మహానాయకుడు’ విడుదలకు ముందు మీడియాకు ఎక్కుతారు అన్న గాసిప్పులు కూడ మొదలైపోయాయి. ఒకవైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సమస్యలతోపాటు ఇప్పుడు ‘కథానాయకుడు’ బయ్యర్ల సమస్యలు కూడ ‘మహానాయకుడు’ ను చుట్టుముట్టడంతో ఈ మహా సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కు ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక బాలకృష్ణ తీవ్ర అంతర్మధనానికి లోనవుతున్నట్లువార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: