100 కోట్ల క్లబ్ లో ‘ఎఫ్ 2’!

siri Madhukar
టాలీవుడ్ లో ఈ మద్య ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న సినిమాలు అనుకోని విజయాలు సాధించి మంచి వసూళ్లు కూడా రాబట్టుతున్నాయి.  గతంలో అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమాలు మొదట విమర్శలు వచ్చినా..తర్వాత బీభత్సమైన వసూళ్లు రాబట్టాయి.  ఈ సంక్రాంతి కానుకగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి.  క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటించిన కథానాయకుడు, బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ, కార్తి సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పెటా సినిమాలు రిలీజ్ అయ్యాయి. 

అయితే ఈ సినిమాలతోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టీరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2 ’ సినిమా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయ్యింది. కానీ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తో దూసుకు వెళ్లింది.  కథానాయకుడు, వినయవిధేయ రామ సినిమాలు యావరేజ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా కూడా బాగానే దెబ్బ పడింది. ఇక ఎఫ్ 2 విషయానికి వస్తే ఫుల్ లెన్త్ కామడీ ఉండటంతో సామాన్య ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.  దాంతో అటు ఓవర్సీస్, ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. 

 ఈ నెల 12వ తేదీన సంక్రాంతి బరిలోకి దిగింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను విజయవిహారం చేస్తూ కొత్త రికార్డులను కొల్లగొడుతోంది.  ఈ సినిమా థియేటర్లకు వచ్చిన 13 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకి పైగా షేర్ ను .. ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ ఏడాది ఆరంభంలో తెలుగులో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన తొలి సినిమాగా తన ప్రత్యేకతను చాటుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: