ఎన్టీఆర్‌లో బాలయ్య కంటే " ఆ నటుడే " బాగా చేశాడా..?

Chakravarthi Kalyan
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలతో తెలుగునాట సంక్రాంతి సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ తన నటజీవితంలోనే హైలెట్‌గా విశ్వరూపం చూపించడంతో ఎన్టీఆర్ ఫస్ట్ పార్ట్ బయోపిక్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్నిచోట్లా మంచిటాక్ సంపాదించింది.



ఈ సినిమాలో బాలయ్య నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాకపోతే.. యంగ్ ఎన్టీఆర్ గెటప్‌లో వయసుమీరిన బాలయ్య సరిగ్గా సెట్ కాలేదన్న వెలితి కాస్త ఉండిపోయింది. అయితే ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా సెట్ అయ్యింది మాత్రం ఏఎన్నార్‌ గా నటించిన సుమంత్ అని అందరినోటా వినిపిస్తోంది.



నటుడు సుమంత్..తన తాతగారి పాత్రలో జీవించాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో సుమంత్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. చాలా మంది బాలయ్య కంటే ఈ సినిమాలో సుమంతే బాగా చేశాడు.. బాగా సూటయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.



ఒక విధంగా సుమంత్‌ కు కూడా ఇది తన నటజీవితంలోనే బెస్ట్ రోల్ గా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ బయోపిక్‌కు వచ్చిన ఆదరణ చూస్తే ఏఎన్నార్ బయోపిక్ కూడా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఏఎన్నార్‌ పాత్రకు సుమంత్‌ను కళ్లు మూసుకుని తీసుకోవచ్చంటున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: