తనకు సినీ జీవితం ఎంతో ఆనందాన్నిస్తోందని టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అంటోంది. తనకు సినిమా పరిశ్రమ ఎంతో ఇచ్చిందని, ఆ త్రుప్తి తనకు ఎప్పటికీ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక 2018 లో తాను చక్కని పాత్రలు వేశానని, తమిళం, హిందీ వంటి భిన్నమైన భాషల్లో నటించానని, ఓ విధంగా తనకు లక్కీ యియర్ 2018 అంటూ పేర్కొంది. తనకు మంచి అవకాశాలు కూడా పాత ఏడాది ఇచ్చిందని రకుల్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తెలుగులో తనకు అవకాశాలు రాలేదనడాన్ని ఆమె తప్పు పట్టారు. తొమ్మిదేళ్ళుగా సినిమా పరిశ్రమలో ఉన్న తాను అనేక పాత్రలను వేశానని, తన పరిధిని, పరిమితిని పెంచుకోవడానికి తాను ఇతర భాషల్లో గత ఏడాది నటించడం వల్లనే తెలుగులో నటించలేదని రకుల్ అంటోంది. అంతే తప్ప తనకు ఎక్కడా కూడా చాన్సులు తగ్గలేదంటోంది ఈ సొగసరి.
ఇక హీరోయిన్ల ప్రతిభను కేవలం ఒక సినిమ హిట్, ఫట్ లతో పోల్చరాదని కూడా రకుల్ చెబుతోంది. సినిమా విజయం అన్నది అందరి క్రుషి మీదా ఆధారపడి ఉంటుంది, ఏ ఒక్కరి వల్లనో సక్సెస్ రాదు, అలాగే పరాజయం కూడా ఒక్కరికే అంటకట్టకూడదని రకుల్ చెబుతోంది. సినిమా హిట్ అయితే గోల్డెన్ లెగ్ అనే వారే పోతే ఐరన్ లెగ్ అంటూ పక్కన పెడతారని, ఆ ధోరణి చాలా తప్పు అని రకుల్ అంటోంది.
తన వరకు నటన ఎపుడూ ఓడిపోదని రకుల్ విశ్లేషించింది.
ఇదిలా ఉండగా 2019 మొదట్లోనే అన్నగారి మూవీ కధానాయకుడులో ఆకు చాటు పిందె తడిసే సాంగుతో మెరియబోతున్న రకుల్ నితిన్ పక్కన ఓ మూవీలో నటించేందుకు సైన్ చేసింది. మరి కొత్త ఏడాది ఆమెకు ఎన్ని మంచి అవకాశాలు తెలుగులో వస్తాయో చూడాలి.