చైతూ, సమంత 'మ‌జిలీ' మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

siri Madhukar

ఈ సంవత్సరం అక్కినేని ఫ్యామిలీ నుంచి వరుసగా సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి.  నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్’, నాగ చైతన్య నటించిన సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు, సమంత నటించిన యూటర్న్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.  ఈ సినిమాలు అన్నీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.  ప్రస్తుతం నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమా ‘మ‌జిలి’ అనే టైటిల్‌తో కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుపుకుంటుంది.  ఏం మాయ చేసావే సినిమాతో చైతూ, సమంత ప్రేమలో పడ్డారు..వీరిద్దరు పెద్దలను ఒప్పించి రెండు సాంప్రదాయల పద్దతుల్లో వివాహం చేసుకున్నారు.  ఇప్పటికే ఈ జంట ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో నటించారు.  పెళ్లైన తర్వాత మొదటి సారిగా నటిస్తున్న సినిమాకు మజిలి టైలిట్ అనుకుంటూ వస్తున్నారు.   


తాజాగా సినిమాకి అదే టైటిల్ ఫిక్స్ చేసి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ‘ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. చై, సామ్‌ జంటగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. కొత్త ఏడాదిని ఈ సినిమాను ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆడ్వాన్స్‌ న్యూఇయర్‌ శుభాకాంక్షలు. శివ నిర్వాణతో కలిసి పనిచేయడం నా కల. ఏప్రిల్‌లో కలుస్తాం’ అని చైతూ పేర్కొంటూ లుక్‌ను షేర్‌ చేశారు. ఇక ఈ సినిమాలో సామ్‌, చైతూలు భార్య భ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నారు. చైతూ మాజీ క్రికెట‌ర్‌గా ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. సమంత రైల్వే క్లర్క్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.


ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలు, ప్రేమనురాగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నటుడు సుబ్బరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

A film very special to me for obvious reasons #ChaySam4 .. happy to be starting the year with this .. #Nc17 is #Majili advance happy new year to all of you , it’s been a dream working with @ShivaNirvana @Shine_Screens and the rest of the team .. see you this April ! pic.twitter.com/bnPT2b0m4z

— chaitanya akkineni (@chay_akkineni) December 30, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: