మెగా అబ్బాయిని కేటీఆర్ భలే పొగిడేశాడు!

siri Madhukar

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం సామాన్య ప్రేక్షకులకే కాదు..రాజకీయ నేతలకు కూడా ఉంటుంది.  అదీ కాకుండా హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లారు.  యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు.  తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరపై ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు.  ఆయన తనయుడు రాంచరణ్ హీరోగా మంచి విజయాలు అందుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు.


ఈ సంవత్సరం ‘రంగస్థలం’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ‘వినయ విదేయ రామ’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్వయంకృషితో తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు భారత చిత్రసీమలో దిగ్గజంగా, మహానటుడిగా నిలిచారు చిరంజీవి.  ఇండస్ట్రీకి ఆయనకు తగ్గ హీరోని అందించారు..మేము ఎన్నికల్లో మాట్లాడిన దానికంటే ఈ వేదికపై చరణ్ అద్భుతంగా ప్రసంగించాడు.


ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు చరణ్.  ఆ మద్య రాంచరణ్ ని కలిశాను..గుబురు గడ్డంతో కనిపించాడు..ఇదేంటీ ఇలా గడ్డం పెంచావ్ అని అడిగాను..గ్రామీణ నేపథ్య కథాంశంలో నటిస్తున్నానని అన్నాడు. సినిమాల కోసం చిరంజీవి మాత్రమే కాదు ఆయన తనయుడు కూడా ఎంతో డెడికేషన్ తో ఉంటారని ‘రంగస్థలం’సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. . ఎన్నికల సమయంలో నా ప్రతి ప్రసంగంలో ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటూ ఈ సినిమాను వాడుకున్నాను.తెలంగాణ నాగన్నలు, రాజన్నలు తమకు ఏం కావాలో తేల్చుకున్నారు... మమ్మల్ని నిలబెట్టారు. వాస్తవానికి నాకు యాక్షన్ తరహా సినిమాలు అంటే ఇష్టం ఉండదు..మంచి ఎంట్రటైన్ మెంట్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తాను.  కానీ దర్శకుడు బోయపాటి శ్రీను కోసం ఈ సినిమా చూడాలని అనుకుంటున్నాను.


మెగా అభిమానులకు ఈ సినిమా పండుగలా ఉంటుంది.సినిమాలో వినయవిధేయ రామ ఎవరూ అని చిరంజీవిని అడిగాను.  ఈ సినిమాట్రైలర్ చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు.  నిజంగానే రాంచరణ్ ఈ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ మద్య పవన్ కళ్యాన్ తో మాట్లాడినపుడు రాజకీయాల్లోనే కాదు సినీ రంగంలో కూడా మీ అభిమానులు మీకోసం ఎదురు చూస్తున్నారని అన్నాను. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్  కష్టపడేతత్వం, ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష మా అందరికి స్ఫూర్తినిస్తున్నాయి. అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు సాధించిన మీకు మా మెగా అభిమానులు అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: