సోషల్ మీడియా లో నీచమైన కామెంట్స్ ... ఆవేదన చెందిన శ్రీదేవి కూతరు...!

Prathap Kaluva

ఈ రోజుల్లో సోషల్ మీడియా ను కొంత మంది తమ పైత్యాన్ని చూపించడానికి వాడుతున్నారు. అయితే ఈ విషయం లో సెలెబ్రెటీస్ కు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒక టీవీ షోలో జాన్వీ, ఆమె సోదరి అన్షులాలు సరదాగా వ్యవహరించడంపై కొంతమంది తమ పైత్యాన్ని చూపించారు. నీఛమైన మాటలతో వారిని ఇబ్బంది పెట్టారు.


ఈ విషయాన్ని దాచుకోకుండా.. జాన్వీ బయటకు చెప్పింది. తాము ఎదుర్కొన్న ఇబ్బందిని వివరించింది. ఈ అంశంలో అర్జున్‌ కపూర్‌ కూడా స్పందించాడు. అత్యంత నీఛమైన మాటలతో చెలరేగిన వారిని ఒకింత సంస్కారంతోనే సమాధానం చెప్పాడు అర్జున్‌ కపూర్‌. ఇక్కడ జాన్వీ, అన్షులా, అర్జున్‌లు వ్యక్తిగతంగా ఏమైనా కావొచ్చు, వారి వ్యక్తిగత జీవితం ఏదైనా కావొచ్చు. కానీ నీచమైన కామెంట్లతో వారిని ఇబ్బంది పెట్టే అధికారం ఎవరికీ లేదు. ఎవరి అభిమానులకు అయినా అలాంటి హక్కులేదు.


సోషల్‌ మీడియాలోకి, వెబ్‌సైట్లలోకి వచ్చి అడ్డగోలు కామెంట్లను పెట్టడం, అసభ్యమైన మాటలు, నీఛమైన మాటలతో కామెంట్లు పెట్టడం ద్వారా కొంతమంది తామేదో సాధిస్తున్నామని అనుకుంటున్నారు. అయితే అది వారికి ఉన్న మానసిక రోగం ప్రభావం మాత్రమే. ఔను, ఇంటర్నెట్‌లో అసభ్యకరమైన చేష్టలు చేయడం ఒకరకమైన మానిసక రోగమే. ఆ రోగ ప్రభావంతోనే కొందరు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విషయంలో చికిత్స తీసుకోవాలి. అయితే ఇలాంటి వారికి ఆ రోగంలో మగ్గిపోవడమే ఆనందం. ఆ విషయాన్ని వారు గుర్తించలేరు. ఎలాగూ వారెవరో అధికారికంగా చెప్పుకోలేరు. ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసుకుని తమ పైత్యానికి, తమ మానిసక రోగానికి అనుగుణంగా కామెంట్లు, పోస్టులతో చెలరేగిపోతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: