ఎగ్ ఫ్రీజింగ్ తో తల్లి కాబోతున్న.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్?

praveen
ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మాతృత్వపు అనుభూతిని అనుభవించాలి అనే ఒక కోరిక ఉంటుంది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొని పిల్లలను కనీ అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో మంది మహిళలు తెగ ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఇలా అమ్మ అని పిలిపించుకునే అవకాశం వస్తే ఆ అరుదైన అవకాశాన్ని వదులుకునేందుకు ఎవరు కూడా పెద్దగా ఇష్టపడరు అని చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం సినీ సెలెబ్రిటీలు ఇలా మాతృత్వపు అనుభూతిని పొందెందుకు ఇష్టపడటం లేదు.

 గర్భం దాల్చి పిల్లలను కంటే ఏకంగా తమ అందం పాడవుతుంది అని అనుకుంటూ చివరికి ఏకంగా పిల్లలు కనడం విషయంలో కూడా కొత్త పద్ధతులను వెతుకుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాగే అటు సౌత్ ఇండియాలో లేడి సూపర్ స్టార్ గా గుర్తింపును సంప్రదించుకున్న నయనతార సైతం సరోగసి పద్ధతి ద్వారా ఏకంగా కవల పిల్లలకు తల్లిగా మారింది అన్న విషయం తెలిసిందే   ఇక మరి కొంతమంది హీరోయిన్లు ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా పిల్లలను కనెందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే వయసులో ఉన్నప్పుడే ఏకంగా ఆరోగ్యకరమైన అండాన్ని భద్రపరిచి ఇక కావలసినప్పుడు పిల్లలను కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా అవకాశం ఉంటుంది.

 అయితే ఇటీవలే మృనాల్ ఠాగూర్ సైతం ఇలా ఎగ్ ఫ్రీజింగ్ ద్వారానే పిల్లలను కనాలని అనుకుంటున్నాను అంటూ షాపింగ్ విషయాలు చెప్పుకొచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే మరో హీరోయిన్ మెహరీన్  సైతం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొన్నట్లు వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చింది. రెండేళ్ల నుంచి ఎగ్ ఫ్రీజింగ్ కోసం ప్రయత్నిస్తున్న ఇప్పటికి పూర్తయింది. ఈ విషయం అందరికీ చెప్పాలా వద్దా అని కూడా ఆలోచించా. కానీ కొంతమంది మహిళల కోసం ఈ విషయం బహిర్గతం చేస్తున్నా అంటూ మెహరీన్  చెప్పుకొచ్చారు. దీంతో మాతృత్వపు అనుభూతిని కూడా ఆర్టిఫిషియల్ చేసేసారు అంటూ ఎంతోమంది నేటిజన్స్  హీరోయిన్ల వ్యాఖ్యలపై కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: